Tragedy at Director Bobby Home: డైరెక్టర్ బాబీ ఇంట తీవ్ర విషాదం
Director Bobby Father Kolli Mohan Rao Passed Away: టాలీవుడ్ దర్శకుడు బాబీ (కొల్లి రవీంద్ర) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు
Director Bobby Father Kolli Mohan Rao Passed Away: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ దర్శకుడు బాబీ (కొల్లి రవీంద్ర) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆయన 154వ చిత్రం వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్న దర్శకుడు బాబీ తండ్రి కొల్లి మోహనరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను కొంతకాలం క్రితం హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో కాలేయ సంబంధిత సమస్యతో చికిత్స తీసుకుంటూ ఆయన మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. చనిపోయే నాటికి ఆయన వయసు 69 సంవత్సరాలు. ఈ నేపథ్యంలోనే కొల్లి మోహన్ రావు స్వగ్రామం అయిన గుంటూరు జిల్లా నాగారం పాలెంలో సోమవారం నాడు అంత్యక్రియలు జరపనున్నారు. గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగిన దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) 2003లో రైటర్ చిన్ని కృష్ణ దగ్గర అసిస్టెంట్ గా తన కెరీర్ ప్రారంభించారు.
ఆ తర్వాత దర్శకుడు దశరథ్, గోపీచంద్ మలినేని వంటి వారి దగ్గర అసిస్టెంట్లుగా పనిచేశారు. భద్రాద్రి అనే సినిమాకు స్టోరీ అందించి సినీ రంగ ప్రవేశం చేసిన బాబీ ఆ తర్వాత కన్నడలో వీరపరంపరే అనే సినిమాకు స్క్రీన్ ప్లే -స్టోరీ అందించారు. తర్వాత డాన్ శీను, ఓ మై ఫ్రెండ్, బాడీగార్డ్ వంటి సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన ఆయన బలుపు, అల్లుడు శీను లాంటి సినిమాలకు కథ అందించారు. ఇక ఆ తర్వాత పవర్ అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి రెండో సినిమాతోనే పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేశారు.
ఆ సినిమా అంత పేరు తీసుకు రాకపోయినా తర్వాత జై లవకుశ సినిమాతో హిట్ అందుకున్న ఆయన వెంకీ మామతో మరోసారి హిట్ అందుకున్నారు. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
Also Read: Suresh Babu Sold Theatre: ప్రైం సెంటర్లో థియేటర్ అమ్మేసిన సురేష్ బాబు
Also Read: Cine Glamour for BJP: అసలు ప్లాన్ అదే.. అందుకే మొన్న ఎన్టీఆర్ నిన్న నితిన్.. నెక్స్ట్ టార్గెట్ కూడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి