Suresh Babu Sold Jyothi Theatre in Vishakapatnam: చాలా కాలం నుంచి థియేటర్లు మూతపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని సినీ పరిశ్రమలో అనేక మంది నిర్మాతలు వాపోతున్న పరిస్థితుల గురించి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు విశాఖపట్నం నడిబొడ్డున ఉన్న జ్యోతి థియేటర్ ను అమ్మేసినట్టు తెలుస్తోంది. ఈ థియేటర్ యజమాని సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్ బాబు విజయనగరానికి చెందిన వ్యాపారులకు దాన్ని విక్రయించారు అని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో థియేటర్ కూల్చి వేసి అక్కడ పది అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్మించడానికి ఆ ప్రాపర్టీని కొనుక్కున్న వ్యాపారుల సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం పది అంతస్తుల్లో 80 అపార్ట్మెంట్లు వచ్చేలా అలాగే మరికొన్ని ఆఫీస్ స్పేస్, షాపులు వచ్చేలా ఆ కాంప్లెక్స్ డిజైన్ చేయబోతున్నారని తెలుస్తోంది. విశాఖలో ఉన్న అత్యుత్తమ థియేటర్లలో జ్యోతి థియేటర్ కూడా ఒకటి.
అలాంటి ధియేటర్ అమ్మి వేయడం అనేది ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అది కూడా వేరే ఎవరో అమ్మేస్తే వేరేలా అనుకోవచ్చు కానీ సినీ నిర్మాణ రంగంతో పాటు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా పాతుకుపోయిన సురేష్ బాబు ఈ నిర్ణయం తీసుకోవడం మరింత చర్చకు తావిస్తోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల విషయంలో కూడా గతంలో సురేష్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం చెప్పిన రేట్లతో థియేటర్లు నడపడం కంటే వాటిని మూసి వేయడం నయమని ఆయన పలు సందర్భాల్లో కామెంట్ చేశారు . ఇప్పుడు ఏకంగా సినిమా ధియేటర్ మూసివేసి పరిస్థితిలో థియేటర్ అమ్మివేయడం అనేది టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ఈ విషయం మీద సురేష్ బాబు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Cine Glamour for BJP: అసలు ప్లాన్ అదే.. అందుకే మొన్న ఎన్టీఆర్ నిన్న నితిన్.. నెక్స్ట్ టార్గెట్ కూడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి