Veera Simha Reddy Fan Made Poster : వీర సింహారెడ్డి ఫ్యాన్ మేడ్ పోస్టర్.. అవాక్కైన డైరెక్టర్ గోపీచంద్ మలినేని
Veera Simha Reddy Fan Made Poster ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ఏ రేంజ్లో టాలెంట్ చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒరిజినల్ పోస్టర్ల కంటే ఎక్కువగా ఫ్యాన్ మేడ్ పోస్టర్లు వైరల్ అవుతుంటాయి.
Veera Simha Reddy Fan Made Poster : నందమూరి బాలకృష్ణ హీరోగా రాబోతోన్న వీర సింహారెడ్డి సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల కోసమే తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. బాలయ్య లుక్, గెటప్, డైలాగ్స్ ఇలా అన్నీ కూడా మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలానే ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ జై బాలయ్య మాత్రం దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది.
జై బాలయ్య ఆంథమ్ అంటూ వచ్చిన ఈ పాటకు నాటి ఒసేయ్ రాములమ్మ పాటకు కాపీ ట్యూన్‌గా నిలిచింది. దీంతో జనాలు వీర సింహారెడ్డి జై బాలయ్య పాటను ట్రోల్ చేయసాగారు. బాలయ్య వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్యలు సంక్రాంతి బరిలో నిలవడంతో ప్రతీ విషయంలో పోటీ నెలకొంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా పోలికలు పెట్టేస్తున్నారు ఇరు హీరోల అభిమానులు. దీంతో మొదటి పాటలో చిరంజీవి బాస్ పార్టీ కాస్త ముందుంది.
అయితే ఇప్పుడు అభిమానులు సినిమా టీంలోని మెంబర్ల కన్నా క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారు. సినిమా టీం నుంచి ఆలస్యంగా అప్డేట్లు వస్తుండటంతో.. అభిమానులే పూనుకుని పోస్టర్లు రెడీ చేస్తున్నారు. ఆ మధ్య పుష్ప, రాధే శ్యామ్, సలార్ నుంచి ఇలాంటి ఫ్యాన్ మేడ్ పోస్టర్లే ఎక్కువగా వైరల్ అయ్యాయి.
తాజాగా వీర సింహారెడ్డి సినిమా నుంచి కూడా బాలయ్య లుక్‌కు సంబంధించిన పోస్టర్ ఒకటి నెట్టింట్లో వైరల్ కాసాగింది. దాన్ని చూసిన గోపీచంద్ మలినేని షాక్ అయ్యాడు. చూస్తుంటే ఇది అఫిషియల్ పోస్టర్‌లానే కనిపిస్తోంది. అదిరిపోయింది.. ఇలానే మీరు మా సినిమా మీద ప్రేమను కురిపిస్తూ ఉండండి.. జనవరి 12న దుమ్ములేపేద్దాం అంటూ గోపీచంద్ మలినేని ట్వీట్ వేశాడు.
Also Read : Ariyana Glory Photoshoot : అంతా కనిపించేస్తోందిగా.. అరుపులు పుట్టించేస్తోన్న అరియానా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook