Jabardasth Ram Prasad Hair Transplant : జబర్దస్త్ రామ్ ప్రసాద్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. గెటప్ శ్రీను కౌంటర్లు

Jabardasth Ram Prasad Hair Transplant జబర్దస్త్ రాం ప్రసాద్ తాజాగా హెయిర్ ట్రాన్స్‌ప్లెంటేషన్ చేసుకున్న సంగతి తెలిసిందే. సుధీర్ గాలోడు సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో రాం ప్రసాద్ మొదటిసారిగా కొత్తగా కనిపించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2022, 06:40 PM IST
  • బుల్లితెరపై జబర్దస్త్ సందడి
  • రాం ప్రసాద్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
  • కౌంటర్లు వేసిన గెటప్ శ్రీను
Jabardasth Ram Prasad Hair Transplant : జబర్దస్త్ రామ్ ప్రసాద్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. గెటప్ శ్రీను కౌంటర్లు

Jabardasth Ram Prasad Hair Transplant జబర్దస్త్ షోతో ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అంతకు ముందు ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా కాళ్లు అరిగేలా తిరిగిన వారికి ఒక్కసారిగా జబర్దస్త్ వచ్చి వెలుగులు నింపింది. ఇక జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ విడగొట్టేశారు. జబర్దస్త్ షోకు ఆది.. ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ అన్నట్టుగా మారింది. అయితే ఇప్పుడు సుధీర్ ఈ షోలను చేయడం లేదు. గెటప్ శ్రీనుకు సినిమా అవకాశాలు ఎక్కువ అవుతుండటంతో.. గ్యాప్ ఇచ్చేస్తున్నాడు.

ఇప్పుడు అయితే గెటప్ శ్రీను, రాంప్రసాద్‌లు మాత్రమే ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. సుధీర్ అయితే సినిమాల్లో హీరోగా మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే సుధీర్‌కు ఎట్టకేలకు ఓ హిట్ వచ్చింది. గాలోడు అంటూ సుధీర్ హిట్టు కొట్టేశాడు. ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో రాం ప్రసాద్, గెటప్ శ్రీను పాల్గొన్నారు. సుధీర్ ఇంటికెళ్లి మరీ.. కేక్ కట్ చేయించారు. ఆ సమయంలోనే రాం ప్రసాద్ హెయిర్ ట్రాన్స్‌ప్లెంటేషన్ గురించి బయటకు వచ్చింది.

రాం ప్రసాద్ తన జుట్టు కోసం ప్లాంటేషన్ చేసుకున్నాడని అందరికీ అర్థమైంది. అయితే ఇప్పుడు అదే విషయం మీద గెటప్ శ్రీను కౌంటర్లు వేశాడు. తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో శ్రీను, రాం ప్రసాద్ సందడి చేశారు. ఇక ఇందులో శ్రీను కౌంటర్లు వేస్తూ.. నీకు కామెడీ తగ్గింది.. జుట్టు మీద కాన్సన్‌ట్రేషన్ చేస్తున్నావ్.. జడ్జ్‌లే ఎక్కువగా కామెడీలు చేస్తున్నారు అంటూ గెటప్ శ్రీను కౌంటర్ వేశాడు.

మొత్తానికి రాం ప్రసాద్ మాత్రం తన జుట్టు కోసం బాగానే కష్టపడుతున్నాడనిపిస్తోంది. రాం ప్రసాద్ హెయిర్ ట్రాన్స్‌ప్లెంటేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రాం ప్రసాద్ హీరోగానూ ట్రై చేస్తున్నాడు.. అందుకే ఇలా హెయిర్ మీద ఫుల్ కేర్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఆల్రెడీ రాం ప్రసాద్ ఓ సినిమాతో అందరినీ అలరించేందుకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read : Trivikram Mahesh Babu : SSMB 28 అప్డేట్.. అన్నీ మార్చినా పూజా హెగ్డేను మాత్రం మార్చని గురూజీ

Also Read : Nandamuri Balakrishna : దిల్ లేని రాజు.. దిల్ రాజు.. బాలయ్య పంచ్‌లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News