హైదరాబాద్: నటి అనుష్క శెట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తుందని, నేర్చుకునేతత్వం తనకున్న గొప్ప లక్షణమని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసించారు. టాలీవుడ్‌కు స్వీటీ ఎంట్రీ ఇచ్చి 15ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘Celebrating 15 Years Of Anushka Shetty’ పేరిట హైదరాబాద్‌లో భారీ ఈవెంట్ నిర్వహించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి ఆమెతో పనిచేసిన దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. అనుష్క గురించి కొన్ని ఆసక్తికర విషయాలు రాజమౌళి వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కీలక ఘట్టం.. ఆ కీచకుడికి 23ఏళ్ల జైలుశిక్ష!


అనుష్క గురించి అందరిలా కాకుండా కొత్తగా ఏదైనా చెబుతానంటూ రాజమౌళి స్వీటీకి సర్ ప్రైజ్ ఇచ్చారు.  ‘స్వీటీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తుంది. ఎంతలా అంటే ప్రస్తుతం ఇక్కడ ఎవరు మాట్లాడితే ఎంత రెస్పాన్స్ వస్తుంది. లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని కూడా ఆమె గమనిస్తుంది (స్టేజీపై నవ్వులు). విక్రమార్కుడు సినిమా సమయంలో అనుష్క నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఎంతలా అంటే ప్రతి సీన్ చేసి చూపించాలని కోరేది. రొమాంటిక్ సీన్లలో కూడా అదే ఫాలో అయింది. ఆఖరికి రవితేజతో రొమాన్స్ చేసి చూపిస్తే స్వీటీ అలాగే చేసిందని’ రాజమౌళి వివరించారు.


దటీజ్ ‘స్వీటీ’.. అనుష్క శెట్టి సూపర్ స్పీచ్



స్వీటీ తనకు మాత్రమే క్లోజ్ అని భావించానని, కానీ తన భార్యకు, వదినకు, మా పిల్లలకు, కుటుంబసభ్యులు అందరికీ చాలా క్లోజ్ అని తెలిసిందన్నారు. ప్రతి ఒక్కరితో కలివిడిగా ఉంటుందని విక్రమార్కుడు సమయంలోనే తెలిసింది. తన సినిమాల్లో హీరోయిన్లకు అంతగా ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇవ్వలేదని, అయితే అనుష్కకు మాత్రం బాహుబలిలో దేవసేన పాత్ర క్రియేట్ చేసినందుకు గర్వంగా భావిస్తున్నానని రాజమౌళి తెలిపారు. అందుకు అనుష్క కూడా అదే స్థాయిలో నటించి మెప్పించారంటూ స్వీటీపై ప్రశంసల జల్లులు కురిపించారు.


See Pics: స్వీటీ అనుష్క స్వీట్ ఫొటోలు


కాగా, అనుష్క తాజా సినిమా ‘నిశ్శబ్దం’ టీజర్, ట్రైలర్ రెండూ చాలా బాగున్నాయని చెప్పారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా విడుదలయ్యే ఏప్రిల్ 2వ తేదీ కోసం తాను  ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. గ్యాప్ తర్వాత తెరమీద కనిపించనున్న అనుష్క ఈ సినిమాలో మూగ అమ్మాయి పాత్ర పోషించారు.


మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..