Allu Arjun-Samantha: ఆలియా భట్ హీరోయిన్గా చేస్తున్న జిగ్రా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా జరిపారు. ఈ ఈవెంట్ కి త్రివిక్రమ్, సమంత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో సమంత గురించి త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయానికి వస్తే.. సమంత ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమంత తెలుగులో నటించిన మొదటి చిత్రం. అంతేకాకుండా ఈ చిత్రంలో సమంత మాజీ భర్త నాగచైతన్య హీరోగా నటించారు. అయితే సమంత, నాగచైతన్య ప్రేమ మొదలైంది మాత్రం ఈ చిత్రంతో కాదు. ఈ సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది.


అయితే ఈ సినిమాతో నాగచైతన్య సమంతతో ప్రేమలో పడకపోయినా.. ఈ సినిమా వల్ల ఆమె ప్రేమలో ఎంతోమంది పడిపోయారు. వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఇదే విషయాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తెలియజేయడం గమనర్హం. 


జిగ్రా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ..”నా సినిమాకి నేనే హీరో అన్నారు. కానీ మీరే హీరోలు,” అంటూ సమంతని సంబోధిస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. “ఏ మాయ చేసావే సినిమాతో మీరు ఎంతోమందిని మాయ చేసారు.. అప్పట్లో నాకు బన్నీ ఫోన్ చేసి.. ఏం మాయ చేసావే అనే సినిమాలో సమంత అని ఒక కొత్త అమ్మాయి వచ్చింది. మీరు ఆ సినిమా చూశారా. ఆ అమ్మాయి కోసమైనా ఆ సినిమా చూడండి అని చెప్పాడు. అల్లు అర్జున్ మీకు చాలా పెద్ద ఫ్యాన్,” అంటూ చెప్పుకొచ్చారు. 


అంతేకాకుండా అమ్మాయి అంటేనే శక్తి అని.. ప్రస్తుతం మనం నవరాత్రులు జరుపుకుంటున్నామని.. అమ్మ లేకుండా తను లేరని.. అలానే అమ్మాయిలు లేకుండా అసలు సృష్టి లేదు అంటూ.. అమ్మాయిలను అలానే సమంతను తెగ పొగిరేసారు త్రివిక్రమ్. ఇక త్రివిక్రం మాటలు విని సమంత కూడా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.


 



Read more: Nagarjuna: నాంపల్లి కోర్టులో హజరైన నాగార్జున.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏం చెప్పారంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter