Chiranjeevi-Venki kudumula Combo: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'గాడ్ ఫాదర్, భోళాశంకర్' తదితర సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు క్యూలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలు పూర్తయ్యే నాటికి చిరుతో ఓ పవర్‌పుల్ మూవీ తీసేందుకు వెంకీ కుడుముల సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఛలో, భీష్మ చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న వెంకీ..మెగా స్టార్‌తో మెగా హిట్ కొట్టాలనభావిస్తున్నారట.   


చిరంజీవి కెరీర్‌లో బెస్ట్‌ మూవీస్‌లో ఒకటి ఠాగూర్ అన్న సంగతి తెలిసింది. అవినీతికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో చిరంజీవి నటన హైలైట్‌గా సాగుతుంది. రమణ పేరుతో విజయ్‌కాంత్ హీరోగా దర్శకుడు మురుగదాస్ తమిళంలో తెరకెక్కించిన చిత్రానికి ఠాగూర్ రీమెక్. అప్పట్లో ఠాగూర్ సూపర్ డూపర్ హిట్ అయింది.




చిరు నుంచి మళ్లీ అంత పవర్‌పుల్‌, సందేశాత్మక చిత్రం మరొకటి రాలేదు. ఇప్పుడా లోటు తీర్చేందుకు వెంకీ కుడుముల సిద్ధమవుతున్నారు. బలమైన సందేశానికి అన్ని కమర్షియల్ హంగులు జోడిస్తూ స్క్రిప్ట్ కూడా రెడీ చేశారు వెంకీ కుడుముల. డీవీవీ దానయ్య నిర్మించబోతున్న ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.


Also Read: Nagababu on Niharika: నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసింది నేనే..


Also Read: IPL 2022: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. రీ ఎంట్రీ ఇస్తున్న హాట్ యాంకర్‌! ఇక పండగే పో!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి