Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో అప్పుడే గొడవలు ప్రారంభమైపోయాయి. నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్‌లో పాత, కొత్త కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం, ఘర్షణ రేగుతోంది. అసలేం జరిగిందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్ నిన్న అంటే ఫిబ్రవరి 26న ప్రారంభమైంది. ఈసారి షోలో పాత కంటెస్టెంట్లు, కొత్త కంటెస్టెంట్లు ఉన్నారు. పాత కంటెస్టెంట్లను వారియర్లుగా, కొత్త కంటెస్టెంట్లను ఛాలెంజర్లుగా పిలుస్తున్నారు. అటు షో హోస్ట్ చేస్తున్న కింగ్ నాగార్జున ఛాలెంజర్లు, వారియర్ల మధ్య చిచ్చు రేపి వదిలేశారు. ఇద్దరి మధ్య పెట్టిన పోటీ కాస్తా ఘర్షణకు దారి తీస్తోంది. 


ఇందులో భాగంగా ఛాలెంజర్ల నుంచి అనుమతి పొందిన ఒక వారియర్‌కు మాత్రమే బెడ్‌రూమ్‌లో నిద్రించే అవకాశముంటుందని నిబంధన పెట్టాడు బిగ్‌బాస్. మరోవైపు ఛాలెంజర్స్ భోజనం చేిన తరువాతే వారియర్స్ అంతా ఒకేసారి తినాలనే నిబందన కూడా ఉంది. వారియర్లు ఎవరేం చేయాలనేది ఛాలెంజర్ల ఆధ్వర్యంలో జరిగే జాబ్ మేళాలో నిర్ణయిస్తారు. ఇదే ఇప్పుడు గొడవకు దారి తీసింది. వారియర్ అరియానాకు, ఛాలెంజర్ శ్రీ రాపాకకు మధ్య రేగిన మాటల యుద్ధం తీవ్రమౌతోంది. జాబ్ మేళాలో అరియానాను ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఓవరాక్టింగ్ వద్దని శ్రీ రాపాక అంటుంది. దీనికి తీవ్రంగా స్పందించిన అరియానా అంతెత్తున లేస్తుంది. స్టేట్‌మెంట్స్ ఇవ్వద్దని..తన స్టైల్ ఇలాగే ఉంటుందని..నచ్చకపోతే ఉద్యోగమివ్వద్దని కూడా వాదనకు దిగుతుంది. ఇక మరోవైపు నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమవుతుంది. శ్రీ రాపాక వర్సెస్ అరియానా మధ్య బిగ్‌బాస్ హౌస్‌లో చెలరేగిన ఘర్షణ రానున్న రోజుల్లో మరింత ముదరవచ్చని తెలుస్తోంది. 


Also read: Twiitter Account: ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ భార్య సురేఖ, తొలి పోస్ట్‌తోనే వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook