DJ Tillu Sequel Title Revealed as Tillu Square: సిద్దు జొన్నలగడ్డ హీరోగా డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే, ఆ సినిమా చివర్లోనే సినిమాకు రీమేక్ ఉంటుందని సినిమా మేకర్స్ హింట్ ఇచ్చారు. డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు వస్తుందని సాధారణ ప్రేక్షకులలో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక మరోపక్క తాజాగా దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసింది. ఆసక్తికరంగా సిద్దు జొన్నలగడ్డ ఫిష్ వెంకట్ మధ్య ఒక సంభాషణ జరుగుతున్న వీడియోని సినిమా యూనిట్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ సినిమాకి  డీజే టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరని ఫిష్ వెంకట్ అడిగితే పూజా హెగ్డే అని చెప్పడంతో ఈ సినిమాలో ఆమె హీరోయిన్ కాదని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోందని  డీజే టిల్లు పక్కన ఉండే మార్కస్ చెప్పుకొస్తాడు.


దీంతో డిజె టిల్లు కూడా ఫ్రీగా ఉండే వాళ్ళు మనకి కూడా వద్దు అంటునే సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని చెబుతాడు. ఆ తర్వాత గవర్నమెంట్ అంటే ప్రజలకు సాయం చేయాలి కాబట్టి తనని షూటింగ్ లోకేషన్ లో దించమని ట్రాఫిక్ కానిస్టేబుల్ పాత్రలో ఉన్న ఫిష్ వెంకట్ ని కోరతాడు. ఇక  వస్తాడు ఇక ఈ అనౌన్స్మెంట్ అయితే కాస్త విభిన్నంగానే ఉంది కానీ ఎక్సైట్ చేసే విధంగా లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. గతంలో నరుడా డోనరుడా, అద్భుతం వంటి సినిమాలు, పెళ్లి గోల వెబ్ సిరీస్ లకు డైరెక్షన్ చేసిన మళ్లీ క్రైమ్ డైరెక్ట్ చేయబోతున్నారు.


ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది అని తెలుస్తోంది. సంక్రాంతి తరువాత మంచి డేట్ చూసుకుని మళ్లీ ఫిబ్రవరి నెలలోనే సినిమా విడుదల చేసేందుకు సినిమా యూనిట్ అయితే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది, అయితే ఫిబ్రవరిలోనే విడుదల కుదరక పోతే ఒక నెల ఆలస్యంతో మార్చ్ నెలలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటివరకు అయితే ఈ సినిమాను మార్చ్ నెలలో రిలీజ్ చేయడానికి సిద్దమయినట్టు పేర్కొన్నారు. 


Also Read: Bandala Ganesh - Diwali 2022 : దీపావళి బాంబులకు పెట్టిన ఖర్చు ఎంతంటే?.. బండ్లన్నతో అట్లుంటది.. అన్ని లక్షలా?


Also Read: Mega Fans Full Josh: పూనకాలు తెప్పించేసిన బాస్... ఫుల్ జోష్ లో మెగా ఫాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook