Bandala Ganesh - Diwali 2022 : దీపావళి బాంబులకు పెట్టిన ఖర్చు ఎంతంటే?.. బండ్లన్నతో అట్లుంటది.. అన్ని లక్షలా?

Bandala Ganesh - Diwali 2022 : బండ్ల గణేష్ ఏది చేసినా కూడా తన రేంజ్‌కు తగ్గట్టుగానే ఉంటుంది. బడా నిర్మాత కాబట్టి.. బాంబులను కూడా అదే రేంజులో కొనేశాడనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2022, 04:18 PM IST
  • బడా నిర్మాత భారీ సెలెబ్రేషన్స్
  • దీపావళి పండుగ సందడిలో బండ్ల గణేష్
  • బండ్ల గణేష్ పెట్టిన ఖర్చు ఎంతంటే?
Bandala Ganesh - Diwali 2022 : దీపావళి బాంబులకు పెట్టిన ఖర్చు ఎంతంటే?.. బండ్లన్నతో అట్లుంటది.. అన్ని లక్షలా?

Bandla Ganesh Crackers Cost : బండ్ల గణేష్ ఏ పని చేసినా కూడా తన రేంజ్‌కు తగ్గట్టుగా చేస్తుంటాడు. సినిమాలు తీసినా కూడా అంతే స్థాయిలో తీస్తుంటాడు. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్లు అంటూ ఉంటాడు. ఇప్పుడు తీస్తే కూడా పెద్ద హీరోతో పెద్ద సినిమానే తీస్తాను అని అంటాడు. అలా బడా నిర్మాతగా బండ్ల గణేష్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్లున్నాయి. ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు. రాజకీయాలకు మళ్లీ దగ్గరవుతున్నట్టుగా అనిపిస్తోంది.

సినిమాల్లో ఉన్నా లేకపోయినా, రాజకీయాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చినా ఇవ్వకున్నా కూడా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటాడు. ట్విట్టర్‌లో తన ఫాలోవర్లకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాడు. ట్విట్టర్‌లో బండ్లన్న వెంటనే రియాక్ట్ అవుతుంటాడు. ఎవరికి ఏ సాయం కావాలన్నా కూడా చేతనైంత చేస్తుంటాడు. కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేశాడు.

బండ్ల గణేష్ ప్రతీ దీపావళికి టపాసులు కొంటాడు. వాటిని ఇంటి ముందున్న వరండాలో పేర్చుతాడు. వాటిని ముందు నిల్చుని అలా ఫోటో దిగుతాడు. ఊరంతా సరిపోయే టపాసులను కొంటాడా? అని అందరికీ అనుమానం వచ్చేది. గత రెండేళ్ల నుంచి బండ్ల గణేష్ ఇలానే చేస్తూ ఉన్నాడు. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు.

అయితే ఈ ఏడాది మాత్రం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడో బయటకు వచ్చింది. మీడియాతో మాట్లాడుతూ.. అసలు సంగతి చెప్పేశాడు బండ్లన్న. నాలుగు లక్షల విలువైన టపాసులను కొనేశాడట బండ్లన్న. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నోరెళ్లబెట్టేశారు. వామ్మో బండ్లన్న మామూలోడు కాదు.. బండ్లన్నతో అట్లుంటది అంటూ ట్వీట్లు పెడుతున్నారు. అయితే బండ్ల గణేష్ ఇందులో చాలా మటుకు గిఫ్టులుగా అందరికీ పంపిస్తాడని తెలుస్తోంది.

బండ్లన్న ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలు, అందులో మాట్లాడిన మాటలు, ఆడియో లీకుల మీద నోరు విప్పడం, త్రివిక్రమ్‌ను తాను తిట్టానని ఒప్పుకోవడం అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మరి బండ్లన్న సినిమాలను నిర్మిస్తాడా? లేదా రాజకీయాల్లో బిజీ అవుతాడా? అన్నది చూడాలి.

Also Read : jabardasth Varsha Hospitalised : ఆస్పత్రి బెడ్డు మీద జబర్దస్త్ వర్ష  

Also Read : Manchu Vishnu - Prabhas : బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్.. ప్రభాస్‌కు విషెస్.. మంచు విష్ణుపై ఫ్యాన్స్ ఫైర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News