Karthika Deepam Nava Vasantham Serial: తెలుగు సినిమాలలో సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. హిట్టు.. ఫ్లాపులతో సంబంధం లేకుండా, అసలు కథకి కొనసాగింపు అవసరమా లేదా అని కూడా ఆలోచించకుండా మన తెలుగు దర్శకులు చాలామంది సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు. సినిమాలలో ఈ సీక్వెల్స్ పిచ్చి ఏంటిరా బాబు అనుకుంటున్న నేపథ్యంలో.. సీరియల్స్ సైతం సీక్వెల్స్ అనౌన్స్ చేసి ప్రేక్షకులను మరింత ఆశ్చర్యపరుస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్తీకదీపం సీరియల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ సీరియల్ బుల్లితెరలో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. వంటలక్క క్యారెక్టర్ అప్పట్లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. సీరియల్స్ కి కూడా ఇంత ఫాలోయింగ్ ఉంటుందా అనేలా పేరు తెచ్చుకునింది కార్తీకదీపం. 


ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు యువతను కూడా ఆకట్టుకున్న ఈ సీరియల్ బుల్లితెరలో హైయెస్ట్ టిఆర్పి సంపాదించింది. అయితే ఈ సీరియల్ కన్నా ముందు ఈ లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నాయి చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్.  ఆ రెండు సీరియల్స్ ని అప్పట్లో మళ్ళీ రీ టెలికాస్ట్ చేయండి అంటూ ఆడియన్స్ నుంచి రిక్వెస్ట్ లు రావడంతో వాటిని రీ టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది. 


అయితే ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ కి కూడా అదే డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మేకర్స్ ఈ సీరియల్ ని రీ-టెలికాస్ట్ చెయ్యకుండా సరికొత్తగా ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఇదే విషయాన్ని ధ్రువీకరి కార్తీకదీపం మళ్ళీ మొదలవుతుంది అంటూ డాక్టర్ బాబు ఒక ప్రోమోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు.


 



కొత్త వెలుగులతో కార్తీకదీపం సీరియల్ ని తీసుకు వస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. ‘కార్తీక దీపం ఇది నవవసంతం’ అనే పేరుతో ఈ సీరియల్ మరోసారి ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రోమో చూస్తుంటే.. కార్తీకదీపం మెయిన్ స్టోరీ లైన్‌ని తీసుకోని కొత్త నటీనటులు, కొత్త కథనంతో రూపొందబోతుందని అర్థమవుతోంది. మొత్తానికి ఈ సీరియల్ ఒక కొత్త ట్రెండ్ ని మొదలు పెట్టేసింది. ఇక సూపర్ హిట్ అయిన సీరియల్స్ అన్ని ప్రస్తుతం సినిమాలు ఫాలో అవుతున్నట్టు.. సీక్వెల్ పద్ధతి ఫాలో అయిన మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.


Also Read: TDP JanaSena: పార్టీ వీడేవారికి చంద్రబాబు కీలక సూచన.. భవిష్యత్‌కు 'గ్యారంటీ' ప్రకటన


Also Read: New Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ.. స్థాపించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేస్తుందా?


 



 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook