Dont Believe Fake Videos says Garikipati Narasimha Rao: హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిని గరికిపాటి నరసింహారావు కాస్త కటవుగా సంబోధించడం హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవితో ఫోటోలు ఎక్కువగా దిగుతూ ఉండడంతో ఆయన ఫోటో సెషన్ ఆపితే కానీ దాని ప్రసంగం మొదలు పెట్టనని ఆయన వచ్చి తన పక్కన కూర్చోకపోతే మైకు వదిలేసి వెళ్లిపోవడానికి కూడా తనకు ఎలాంటి మొహమాటం లేదని గరికిపాటి నరసింహారావు పేర్కొన్నారు. అయితే మొదట ఈ విషయం చిరంజీవి చెవిన పడలేదు కానీ ఈ విషయం అర్థమైన వెంటనే మెగాస్టార్ చిరంజీవి సదర్ ఫొటో సెషన్ ఆపేసి వెంటనే వచ్చి గరికిపాటి నరసింహారావు పక్కన కూర్చోవడమే కాక తాను ఆయన అభిమానిని అని త్వరలోనే ఆయన మా ఇంటికి ఆతిధ్యం స్వీకరించడానికి రావాలని కూడా ఆహ్వానించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇక్కడితో ఈ వ్యవహారం సమసి పోతుందని అందరూ అనుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు చేసిన ట్వీట్ ఈ వ్యవహారాన్ని మరింత పెద్దదిగా చేసింది. ఎవరికైనా తన సోదరుడి క్రేజ్ చూస్తే అసూయ పుట్టడం ఖాయం అంటూ ఆయన ట్వీట్ చేయడంతో మెగా అభిమానులు సినీ పరిశ్రమలోని కొంత మంది ఇక రెచ్చిపోయి గరికిపాటి నరసింహారావు మీద ఘాటు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. రాష్ట్ర చిరంజీవి యువత అనే సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న భవాని రవికుమార్ అనే వ్యక్తి ఏకంగా గరికిపాటి నరసింహారావుకి ఫోన్ చేయడమే గాక ఆయనను పొగుడుతూనే మీరు చేసిన పని మాకు ఏమీ నచ్చలేదు చిరంజీవి గారిని అవమానించినట్లుగా ఉందంటే తాను చిరంజీవి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తానని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలివేయాలని గరికిపాటి నరసింహారావు పేర్కొన్నారు.


అక్కడితో ఈ వివాదం సమసి పోతుందనుకుంటే తరువాత జరిగిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ మీట్లో కూడా ఇదే వ్యవహారం మీద పలువురు సినీ ప్రముఖులు గరికిపాటి నరసింహారావునే టార్గెట్ చేశారు. తర్వాత గరికిపాటి నరసింహారావు క్షమాపణలు చెప్పినట్లుగా ఒక నోట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అందులో కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరుతున్నా గరికిపాటి నరసింహారావు అన్నట్లుగా కామెంట్స్ ఉండడంతో వ్యాపారం చేసుకునే సినిమా వాళ్లకు ఇంతలా ప్రాధేయపడుతూ క్షమాపణలు చెప్పడం అవసరమా అంటూ గరికిపాటి అభిమానులు కూడా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఒక సందర్భంలో స్వర్ణకారులకు గరికిపాటి క్షమాపణలు చెబుతున్న వీడియోని తీసుకువచ్చి ఇప్పుడు మెగా అభిమానులకు, మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెబుతున్నారని అంటూ వైరల్ చేస్తున్నారు.


దీంతో గరికిపాటి నరసింహారావు ఫేస్బుక్ పేజీ నుంచి ఈ విషయం మీద స్పందించారు. ‘’శ్రీ గరికిపాటి వారి అభిమానులకు విజ్ఞప్తి గురువుగారి ఫోటోలతో, పాత వీడియోలతో సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని పేర్కొన్నారు. అవాస్తవాలకు, కల్పిత కథనాలకు అభిమానులకు ఆందోళన చెందరాదని గురువుగారి అధికారిక పేజీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని అందులో పేర్కొన్నారు, ఇక ఈ ఫేస్ బుక్ పేజీ శ్రీ గరికిపాటి నరసింహారావు పేరు మీద ఉండగా దానికి ఒకటిన్నర మిలియన్ లైక్స్ ఉన్నాయి. అలాగే ఫేస్బుక్ ఇది అధికారిక ఖాతాగా ధ్రువీకరించింది కూడా. దీంతో మెగాస్టార్ కు గరికిపాటి క్షమాపణలు చెప్పలేదని బహుశా మెగా అభిమానులు తమకు తామే క్షమాపణలుగా చెప్పుకున్నట్టుగా రాసి ఉండవచ్చని ప్రచారం  ఊపందుకుంది. 


Also Read: Ram Gopal Varma - Garikapati : గరికపాటిని వదలని వర్మ.. నెమళ్ల సంతాన ప్రక్రియ వీడియోతో పరువుతీస్తోన్న ఆర్జీవీ


Also Read: Pushpa Keshava : ఏడిపించేసిన పుష్ప కేశవ.. స్టేజ్ మీద ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook