Ram Gopal Varma - Garikapati : అలయ్ బలయ్ ఈవెంట్లో చిరంజీవి మీద గరికపాటి అసహనం వ్యక్తం చేయడం, ఫోటో సెషన్లు ఆపితే.. తాను కంటిన్యూ చేస్తాను అని లేకపోతే వెళ్తాను అంటూ నోరు జారడం అందరికీ తెలిసిందే. గరికపాటి అలా అసహనం వ్యక్తం చేసినా కూడా చిరంజీవి మాత్రం ప్రేమగానే మాట్లాడాడు. ఆ వివాదం అక్కడితోనే ఆగిపోయేది. కానీ నాగబాబు మధ్యలోకి దూరం ట్వీట్ వేయడం, ఏపాటి వాడికైనా చిరంజీవిని చూస్తే అసూయ పరిపాటే అంటూ ఇలా వ్యంగ్యంగా ట్వీట్లు వేయడంతో వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది.
గరికపాటిని మెగా అభిమానులంతా కూడా టార్గెట్ చేశారు. మెగాభక్తుడైన ఉత్తేజ్, బ్రహ్మాజీ ఇలా చాలా మంది గరికపాటి మీద కౌంటర్లు వేశారు. చివరకు పాటల రచయిత అనంత్ శ్రీరామ్ కూడా గరిక, గరికపాటి, బ్రహ్మాస్త్రం, రాముడు అంటూ ఇలా కథ చెప్పుకుంటూ పోయాడు. అలా గరికపాటి మీద మెగా అభిమానులు చేస్తున్న మాటల దాడిని చిరంజీవి ఆపకపోవడం కూడా కాస్త నెగెటివ్‌గానే వెళ్లింది.
గరికపాటి క్షమాపణలు చెప్పడం, వివాదం అంతా కూడా సద్దుమణిగిందని అనుకుంటున్న సమయంలోనే రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ గెలికి గెలికి వివాదాన్ని పెద్దది చేసే ప్రయత్నం చేశాడు. గరికపాటి.. గడ్డిపరక. చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలుసని అనుకుంటున్నాను.. నీకు పద్మ ఎక్కువ.. పద్మ శ్రీ ఎందుకు అన్నట్టుగా గరికపాటి మీద దారుణంగా సెటైర్లు వేశాడు.
😂😂😂😜😜😜😝😝😝😎😎😎 pic.twitter.com/2Wgq7BuCMf
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2022
అది చాలదన్నట్టుగా తాజాగా వర్మ ఓ వీడియోను షేర్ చేసి పకపకా నవ్వేస్తున్న ఎమోజీలను షేర్ చేశాడు. ఆ వీడియోలో గరికపాటి నెమళ్ల సంతాన ప్రక్రియ గురించిచెప్పాడు. నెమలి అంటే బ్రహ్మచర్యానికి ప్రతీక అని అన్నాడు. మగ నెమలి నాట్యమాడుతుంటే.. ఆడ నెమళ్లు అలా చూస్తుంటాయని, మగ నెమలి కంట్లోంచి వచ్చే ద్రవాన్ని ఆడ నెమలి అలా నోటితో అందుకుంటుంది.. అలా సంతానం జరగుతుందంటూ చెప్పుకొచ్చాడు.
కానీ ఆ వీడియోలో మాత్రం నెమళ్లు భిన్నంగా ప్రవర్తిస్తుంటాయి. గరికపాటి చెప్పిన ప్రక్రియకు నెమళ్లు చేస్తున్న పనులకు సంబంధం లేకుండా ఉంటుంది. దీంతో జనాలు గరికపాటిని తిడుతున్నారు. వర్మతో మామూలుగా ఉండదు.. అన్నీ ఫ్రూపులతో వస్తాడు అని వర్మను పొగిడేస్తున్నారు.
Also Read : Pushpa Keshava : ఏడిపించేసిన పుష్ప కేశవ
Also Read : Amitabh Bachchan - Chiranjeevi : చిరుని పట్టించుకోని అమితాబ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook