F3 movie songs: `ఎఫ్ 3` అప్ డేట్.. `లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు` సాంగ్ ప్రోమో రిలీజ్
F3 movie songs: వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ `ఎఫ్3`. `ఎఫ్ 2`కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలోని `లబ్ డబ్ లబ్ డబ్..` అంటూ సాగే పాట ప్రోమో రిలీజైంది.
F3 movie 'Lab Dab Dabboo' song promo Release: వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా 'ఎఫ్ 2'కు సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా 'ఎఫ్3'(F3 movie). అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 28, 2022 న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే నిర్మాతలు ఇప్పటి నుంచే మూవీ ప్రమోషన్ ప్రారంభించేశారు. అందులో భాగంగానే సోమవారం ఫస్ట్ సింగిల్ ‘'లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు'’ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అందుకు ఒకరోజు ముందే ప్రేక్షకులకు చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం.
తాజాగా ఈ పాట ప్రోమోను ('Lab Dab Dabboo' song promo) రిలీచే చేశారు మేకర్స్. దీంతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగాయి. మొదటి నుంచి చెబుతున్నట్లు ఈ సినిమా పైసా చుట్టూ తిరిగే కథతో రానుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ప్రోమోలో వచ్చే ‘'పైస ఉంటే లోకమంతా డ్యాన్స్ క్లబ్'’ అనే చరణం ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సీక్వెల్ చిత్రంలోనూ తమన్నా, మెహరీన్ జంటగా నటిస్తున్నారు.
2019లో విడుదలైన 'ఎఫ్2' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెంకటేష్ (Venkatesh), వరుణ్ (Varun Tej) పోటీపడి మరీ నటించి..ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. నిజానికి 'ఎఫ్3' సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
Also Read: Lata Mangeshkar: లతా మంగేష్కర్ మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook