Family Star: టాలీవుడ్ లో ఉన్న టాప్ నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. కానీ ఈమధ్య దిల్ రాజు సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితం వల్ల లేదా ఆయన ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. తరచుగా దిల్ రాజు పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. స్టేజ్ మీద ఆయన చెప్పే మాటలు చాలా వరకు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన మొదటి భార్య అనిత చనిపోయిన కొన్నేళ్ల తర్వాత దిల్ రాజు తేజస్విని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ఈ మధ్యనే ఒక కొడుకు కూడా జన్మించాడు. లేటు వయసులో పెళ్లి చేసుకున్నారు, పిల్లాడిని కూడా కన్నారు అంటూ దిల్ రాజు పై ఎప్పటికప్పుడు ట్రోల్స్ వినిపిస్తూనే ఉంటాయి. 


కానీ దిల్ రాజు మాత్రం ఈ ట్రోల్స్ ని అసలు పట్టించుకోరట. దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ సినిమా నిన్న విడుదలై నెగిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే దిల్ రాజు మాత్రం ఈ చిత్ర ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దిల్ రాజు ఈ ట్రోల్స్ మీద రెస్పాండ్ అయ్యారు. ట్రోల్స్ ఆయనను ఏమాత్రం ప్రభావితం చేయవు అని కరాకండిగా చెప్పేశారు దిల్ రాజు. అసలు తన భార్య తనకు ఈ ట్రోల్స్ చూపించింది అని చెప్పుకోచ్చారు దిల్ రాజు.


"చాలా కాలం పాటు నాకు ఈ మీమ్స్‌, ట్రోల్స్ గురించి అసలు తెలియదు. వాటి మీద అవగాహన కూడా నాకు పెద్దగా లేదు. ఒకసారి నా పెళ్లి తర్వాత ఒక పెద్ద చానల్‌ కి ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో మాట్లాడుతూ నా భార్య ని నేను ఎలా కలిశాను, మా ఇద్దరి జర్నీ అసలు ఎలా మొదలైంది అనే విషయాలు కూడా చెప్పాను. ఆ వీడియో మీద చాలా ట్రోల్స్‌ వచ్చాయి. అవి నా భార్య నాకు చూపించింది" అని అన్నారు దిల్ రాజు.


"అయినా నేను వాటి గురించి పట్టించుకోను. తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తుపట్టేవారు కోట్లలో ఉన్నారు. అందులో నాపై ఇలాంటి నెగటివ్ కామెంట్స్‌ చేసే వాళ్ళు ఒక పదివేల మంది  మాత్రమే ఉంటారేమో. ఇలా ట్రోల్స్‌, నెగెటివ్‌ కామెంట్స్‌ చేసే వాళ్ల గురించి పట్టించుకుంటూ పోతే నేను మిగతా వాళ్లకు దూరమవుతాను. నేను ఆకాశం లాంటివాడిని. ట్రోల్స్ ఏమైనా నన్ను చంపేస్తాయా? లేదు కదా! అవి కేవలం మేఘాల్లాంటివి. అవి వెళ్లిపోతే ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది’’ అని తాత్వికంగా చెప్పుకొచ్చారు దిల్ రాజు.


Also Read: Python Climb Tree: భారీ చెట్టును సెకన్లలో ఎక్కేసిన కొండ చిలువ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..


Also Read: Bull Attacks Scooter: వామ్మో.. గంగిరెద్దు ఎంతపనిచేసింది.. షాకింగ్ వీడియో వైరల్..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook