Editor Gautham Raju Passes Away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు (68) కన్నుమూశారు. కొంతకాలంగా గౌతమ్ రాజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం (జూలై 5) అర్ధరాత్రి హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. గౌతమ్ రాజు మరణం సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు గౌతమ్ రాజు ఎడిటర్‌గా పనిచేశారు.కేవలం టాలీవుడ్‌లోనే కాక హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. ఎడిటర్‌గా 40 ఏళ్ల ప్రస్థానంలో దాదాపు 800 పైచిలుకు చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. ఎడిటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును గౌతమ్ రాజు దక్కించుకున్నారు. 


1981లో వచ్చిన చిరంజీవి 'చట్టానికి కళ్లు లేవు' సినిమాతో ఎడిటర్‌గా గౌతమ్ రాజు ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. అప్పట్లో నాలుగు స్తంభలాట, రజనీకాంత్ తళపతి,తెలుగులో అసెంబ్లీ రౌడీ లాంటి చిత్రాలకు ఎడిటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆది, ఖైదీ నం.150, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, కిక్, గోపాల గోపాల, అదుర్స్, రచ్చ తదితర సినిమాలకు ఆయన ఎడిటర్‌గా వ్యవహరించారు. ఎన్టీఆర్ 'ఆది' సినిమాకు గాను గౌతమ్ రాజు ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డు అందుకున్నారు. తెలుగులో ఇటీవల మోహన్ బాబు 'సన్నాఫ్ ఇండియా' సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరించారు.



Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు.. కొస్తాంధ్ర, గోదావరి జిల్లాలో అర్ధరాత్రి కుండపోత     


Also Read: Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు... దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరల వివరాలివే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook