Mohan Babu ఫ్యామిలీకి వార్నింగ్.. నలుగురు యువకులు అరెస్ట్
టాలీవుడ్ సినీ నటుడు మోహన్‌బాబు ఫామ్‌హౌజ్ (Mohan Babu Farm House)కు వెళ్లి, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదంటూ నటుడి కుటుంబసభ్యులను భయపెట్టే యత్నం చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
టాలీవుడ్ సినీ నటుడు మోహన్‌బాబు (Mohan Babu) ఫామ్‌హౌజ్‌కు వెళ్లి హల్‌చల్ చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి కొందరు యువకులు ఇన్నోవా కారులో జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఫాంహౌస్‌కు వెళ్లారు. మిమ్మల్ని వదిలేది లేదంటూ నటుడి కుటుంబసభ్యులను హెచ్చరించారు. ఈ ఘటనపై మోహన్ బాబు ఫ్యామిలీ ఫిర్యాదు మేరకు పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆర్జీవీ నెక్ట్స్ మూవీ ‘Allu’.. మళ్లీ రచ్చ రచ్చే!
ఏపీ 31ఏఎన్ 0004 ఇన్నోవా కారులో కొందరు దుండగులు తమ ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. కారు నెంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిందితులను మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌కు చెందిన రాఘవేంద్ర, ఆనంద్, గౌతమ్, డేవిడ్‌లుగా గుర్తించారు. ఈ నలుగురు స్నేహితులు అని పోలీసులు తెలిపారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్