Game Changer Pre Release Event: సంక్రాంతికి విడుదల కానున్న రామ్‌ చరణ్‌ తేజ సినిమా 'గేమ్‌ ఛేంజర్‌'కు సంబంధించి ముందస్తు విడుదల వేడుక (ప్రి రిలీజ్‌ ఈవెంట్‌) ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్నారు. తెలంగాణలో సినిమా ఈవెంట్లకు సానుకూల పరిస్థితి లేకపోవడంతోపాటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కోసం గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌ ఏపీకి తరలివెళ్లింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ వేడుక ఎల్లుండి ఆదివారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KR Krishna: న్యూఇయర్‌ తొలిరోజే సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. షాక్‌లో హీరో నాని


ఎన్‌ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ తేజ, కియారా అద్వానీ జోడీగా దిల్‌ రాజు నిర్మాణంలో 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా రూపుదిద్దుకుంటోంది. జనవరి 10వ తేదీన విడుదల కానుండడంతో ఈ సినిమాకు సంబంధించి ఈవెంట్లు వరుసగా జరగనున్నాయి. కొంత ప్రచారంలో వెనుకబడ్డ ఈ చిత్ర బృందం ప్రి రిలీజ్‌ ఈవెంట్‌తో విస్తృత ప్రచారం పొందాలని భావిస్తోంది. ఈ క్రమంలో రామ్‌ చరణ్‌ తేజ బాబాయి పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో ఏపీలో ఈ ఈవెంట్ నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది.


Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం


భారీ స్థాయిలో ఏర్పాట్లు
పవన్‌ కల్యాణ్‌ కోసం ఈవెంట్‌ను రాజమండ్రిలో నిర్వహించనున్నారు. ఈ నెల 4వ తేదీన రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన అనంతరం పవన్ కల్యాణ్‌ తొలిసారి సినిమా ఈవెంట్‌కు వస్తుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్‌ సంధ్య థియేటర్‌ తొక్కిసలాట సంఘటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నారు.


రాజమండ్రి సమీపంలోని వేమగిరి జాతీయ రహదారి పక్కన 40 ఎకరాల స్థలంలో ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఏపీలోని అన్ని జిల్లాల మెగా అభిమానులు వస్తుండడం.. దాదాపు లక్షకు పైగా ప్రేక్షకులు తరలివస్తారని అంచనా. అంతేకాకుండా మెగా కుటుంబసభ్యులు అందరూ ఒకే వేదికపై కనిపిస్తారనే ప్రచారం జరుగుతుండడంతో పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook