New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం

New Year 2025 Prabhas Message Video Viral: కొత్త సంవత్సరానికి సిద్ధమవుతున్న తన అభిమానులకు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కీలక విజ్ఞప్తి చేశారు. పార్టీల్లో ఎంజాయ్‌ చేయండి.. కానీ డ్రగ్స్‌తో కాదని సూచించారు. వీడియో సందేశం వైరల్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 31, 2024, 04:11 PM IST
New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం

Prabhas Message Viral: కొత్త సంవత్సరానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. పార్టీలకు సిద్ధమవుతున్న తమ అభిమానులకు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కీలక ప్రకటన చేశారు. తన అభిమానులతోపాటు ప్రజలకు 'డార్లింగ్స్‌' అంటూ ముఖ్యమైన సందేశం ఇచ్చారు. వీడియో ద్వారా కొత్త సంవత్సర వేడుకలతోపాటు ఇక ముందు ఎప్పుడూ కూడా డ్రగ్స్‌ తీసుకోకూడదని ప్రభాస్‌ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ ప్రభాస్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో వైరల్‌గా మారింది.

Also Read: Sreeleela Video: తప్పుడు ప్రచారం.. ఫేక్‌ న్యూస్‌పై శ్రీలీల మాస్‌ వార్నింగ్‌

తెలంగాణ ప్రభుత్వం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల రహిత తెలంగాణ మార్చాలనే లక్ష్యంలో భాగంగా పలువురు సినీ ప్రముఖులతో వీడియో సందేశాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌ కూడా సందేశం ఇచ్చారు. కొత్త సంవత్సరం వేడుకల్లో అత్యధికంగా మాదక ద్రవ్యాలు వినియోగించే అవకాశం ఉండడంతో ప్రభాస్‌తో తెలంగాణ ప్రభుత్వం ఈ వీడియో చేయించింది.

Also Read: Allu Arjun Bouncers: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై బౌన్సర్ల సంఘం సంచలన ప్రకటన

'జీవితంలో మనకు బోలెడన్నీ ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు.. మనకోసం బతికే మనవాళ్లు మనకు ఉన్నారు' అని ప్రభాస్‌ తెలిపారు. మరి వారి కోసం.. అవన్నీ ఉన్న సమయంలో 'ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్' అంటూ ప్రభాస్ ప్రశ్నించాడు. డ్రగ్స్‌కు స్వస్తి చెప్పండి అంటూ ప్రభాస్‌ పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ వినియోగిస్తే సమాచారం ఇవ్వాల్సిన నంబర్లను కూడా ప్రభాస్‌ చెప్పాడు. 'మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే 8712671111 నంబర్‌కు ఫోన్ చేయండి' అని ప్రభాస్ సూచించాడు.

డ్రగ్స్‌కు బానిసలైనవాళ్లు పూర్తిగా కోలుకునేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది అని ప్రభాస్‌ వివరించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్‌ కల్కితో ప్రపంచ హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. మారుతీతో ఒక సినిమా చేస్తున్నాడు. అది త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని సినిమాలు కూడా ప్రభాస్‌ చేతిలో ఉన్నాయి. వాటిని త్వరలోనే పట్టాలెక్కించే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News