Geetha Singh Reveals She attempted Suicide Couple of times: అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమా ఎంత సూపర్ హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది గీతా సింగ్. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలవడమే కాక గీతాసింగ్ కి వరుస అవకాశాలు తీసుకొచ్చాయి. ఇందులో గీతాసింగ్ ఒకపక్క నవ్విస్తూనే మరోపక్క కన్నీళ్లు కూడా పెట్టించిందంటే ఆమెకు ఆ సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా తర్వాత ఎవడి గోల వాడిదే, శశిరేఖా పరిణయం, సీమటపాకాయ్, కెవ్వుకేక, పోటుగాడు, శంకరాభరణం, కల్యాణ వైభోగమే, ఈడో రకం ఆడోరకం, తెనాలి రామకృష్ణ, వంటి సినిమాల్లో లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా మెప్పించే ప్రయత్నం చేసింది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె సడన్ గా సినిమాల నుంచి మాయం అయిపోయింది. కానీ గత ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ తరపున పోటీ చేసి గెలుపొందారు.


ఇక తాజాగా ఆమె ఇంటర్వ్యూ ఒకటి యూట్యూబ్ ఛానల్ కు ఇవ్వగా దీనిలో ఆమె చేసిన కామెంట్లు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు ఎందుకు సినిమాల్లో నటించడం లేదని ఆమెను అడిగితే ఇండస్ట్రీలో ప్రస్తుతానికి అవకాశాలు రావడం లేదని అందుకే నటించడం లేదని చెప్పుకొచ్చారు. పరిశ్రమలో తనకు సపోర్ట్ లేదని తెలుగు సినీ పరిశ్రమలో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మన దగ్గర ఎంతోమంది లేడీ కమెడియన్స్ ఉన్నారు కానీ ఎవరు సినిమాల్లో కనిపించడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.


ఇక తన ప్రస్తుత పరిస్థితికి కారణం తాను నమ్మిన వాళ్లేనని పేర్కొన్న ఆమె వారు దారుణంగా మోసం చేశారని ఆఖరికి తోడబుట్టిన వాళ్ళు డబ్బు కోసం వాడుకున్నారని ఎమోషనల్ అయ్యారు. ఇక సినిమాల్లో నటించి ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఒక మనిషిని నమ్మి పోగొట్టుకున్నానని ఆమె పేర్కొన్నారు. ఒకరి దగ్గర చిట్టీలు వేసి సుమారు 6 కోట్ల వరకు నష్టపోయానని ఆమె వెల్లడించారు. అదే సమయంలో సినిమా అవకాశాలు కూడా రాకపోవడంతో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యానని ఈ ఒత్తిడి వల్ల రెండు సార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశానని అయితే ఆ సమయంలో నా స్నేహితురాలు నాకు అండగా నిలిచిందని గీతా సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి తన అన్నయ్య పిల్లలను దత్తత తీసుకుని వారితోనే కలిసి జీవిస్తున్నానని  గీతా సింగ్ పేర్కొన్నారు.


Also Read: Vijay Devarakonda at Uri: ఆర్మీ జవాన్లతో దేవరకొండ ఫోటోలు.. 'జనగణమన' అనుమానాలు?


Also Read: Bigg Boss 6 Elimination: ముందు నుంచి ఊహించినా షాకింగ్ గానే ఈవారం ఎలిమినేషన్.. ఎవరు అవుట్ అయ్యారంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook