God Fatheer, The Ghost, Swathimuthyam Movie Ticket Rates: దసరా సీజన్ మొదలైంది ఈసారి తెలుగులో మూడు సినిమాలు దసరా సీజన్ కు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించిన ది ఘోస్ట్, బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమాలు అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా తెలుగుతో పాటు మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదలవుతుంది. నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా తమిళ్ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందీలో కూడా కాస్త ఆలస్యంగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి స్వాతిముత్యం సినిమా అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. ఇక ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్క సినిమాకి కూడా అధికారికంగా రేట్లు పెంచేందుకు ప్రస్తుతానికి ఎలాంటి అనుమతులు సినిమా యూనిట్లు ప్రభుత్వాలను కోరలేదు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ మూడు సినిమాలకు టికెట్ రేటు 150 రూపాయలుగా ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని మల్టీప్లెక్స్ లు అలాగే ఏషియన్ థియేటర్స్ చైన్లలో  180 నుంచి 200 రూపాయల వరకు ఈ సినిమాల టికెట్లు ఉండే అవకాశం కనిపిస్తోంది.


అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగతా మల్టీప్లెక్స్ థియేటర్లలో గాడ్ ఫాదర్ సినిమాకి 250 టికెట్ రేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ది ఘోస్ట్, స్వాతిముత్యం సినిమాలకు 200 రూపాయలుగా రేటు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ది గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, గెటప్ శ్రీను, పూరి జగన్నాథ్ వంటి వారికి కీలక పాత్రల్లో నటించారు. మోహన్ రాజ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇక నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించగా నాగార్జున సోదరి పాత్రలో గుల్ పనాగ్ నటించింది.


అలాగే మేనకోడలు పాత్రలు అనికా సురేంద్రన్ నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు అలాగే నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద త్రివిక్రమ్ భార్య లక్ష్మీ సౌజన్య నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాతో కొత్త దర్శకుడు సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. 


Also Read: Bandla Ganesh on TV Channel: ఛానల్ పై ఓపెన్ కామెంట్స్.. అడుక్కుతింటున్నారా? అంటూ ఘాటు కౌంటర్!


Also Read: God Father Pre Release Business: షాకింగ్ గా గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్నికోట్లు రాబట్టాలంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook