God Father Movie Producer NV Prasad Clarity on Postponement Rumors: మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. గతంలో తెలుగులో హనుమాన్ జంక్షన్ లాంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్లో ఈ సినిమా రూపొందింది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన పాత్రలో చిరంజీవి, మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాని కొణిదల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద  బ్యానర్ల  మీద ఆర్బీ చౌదరి, ఎన్వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీన దసరా సందర్భంగా సినిమా విడుదల చేయాలని ముందు నిర్ణయించారు. అయితే దసరాకు గట్టి పోటీ ఉండడంతో మెగాస్టార్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. డిసెంబర్ నెలలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉండడంతో సినిమా విడుదల గురించి ఎన్వీ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.


సినిమా అనుకున్న విధంగానే అక్టోబర్ 5వ తేదీని విడుదల చేస్తామని త్వరలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు హైదరాబాదులో ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం లేదని తెలుస్తోంది.


సినిమా తెలుగు సహా హిందీ భాషల్లో విడుదలవుతున్న నేపథ్యంలో ఒక ఈవెంట్ అనంతపురంలో, మరో ఈవెంట్ ముంబైలో ప్లాన్ చేసే విధంగా సినిమా యూనిట్ చర్చలు జరుపుతుందని ఒకసారి ఫైనల్ అయ్యాక అధికారికంగా ప్రకటించి ఆ మేరకు ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సునీల్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు, అలాగే పూరీ జగన్నాథ్ కూడా ఒక జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా మీద మెగా అభిమానులు చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. 


Also Read: Chiranjeevi Tension to Brahmastra: బ్రహ్మాస్త్రం సినిమాకు చిరు టెన్షన్.. ఆ సెంటిమెంట్ తో వణుకు!


Also Read: Sushmita Sen Ex-Boyfriend: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో పార్టీ.. సుష్మితా సేన్‌ మస్త్ ఎంజాయ్ చేస్తుందిగా!




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి