Sushmita Sen Ex-Boyfriend: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో పార్టీ.. సుష్మితా సేన్‌ మస్త్ ఎంజాయ్ చేస్తుందిగా!

Sushmita Sen enjoys With Ex-Boyfriends Rohman Shawl and Ritik Bhasin. సుస్మితా సేన్ ఇచ్చిన పార్టీకి ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రోహ్మాన్‌ షాల్‌తో పాటు తన మరో మాజీ ప్రియుడు రితిక్‌ భాసిన్‌ కూడా వచ్చాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 7, 2022, 08:41 PM IST
  • మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో పార్టీ
  • సుష్మితా సేన్‌ మస్త్ ఎంజాయ్ చేస్తుందిగా
  • మాజీ ప్రియుడు రితిక్‌ భాసిన్‌ కూడా
Sushmita Sen Ex-Boyfriend: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో పార్టీ.. సుష్మితా సేన్‌ మస్త్ ఎంజాయ్ చేస్తుందిగా!

Sushmita Sen enjoys With Ex-Boyfriends Rohman Shawl and Ritik Bhasin: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చల్లో ఉంటున్నారు. 46 ఏళ్ల సుస్మితా.. సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. డేటింగ్, బ్రేకప్ న్యూస్‌తో బీటౌన్‌లో పెద్ద సంచలనంగా మారారు.   భారత టీ20 లీగ్ ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీతో డేటింగ్ అంటూ ఇటీవల వార్తల్లో నిలిచిన సుస్మితా.. తాజాగా ఆయనకు బ్రేకప్ చెప్పిందంటూ ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. సుస్మితా తాజాగా మరోసారి వార్తలో నిలిచారు. 

సుస్మితా సేన్‌ కూతురు రినీ సేన్‌ బర్త్‌డే సెప్టెంబర్‌ 4న జరిగింది. రినీ సేన్‌ బర్త్‌డే సందర్భంగా సుస్మితా గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సుస్మితా మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రోహ్మాన్‌ షాల్‌తో పాటు తన మరో మాజీ ప్రియుడు రితిక్‌ భాసిన్‌ కూడా వచ్చాడు. బర్త్‌డే పార్టీలో ముగ్గురు కలిసి తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను సుస్మితా తన సోషల్‌ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sushmita Sen (@sushmitasen47)

రినీ సేన్‌ బర్త్‌డే పార్టీకి లలిత్‌ మోదీ రాలేదు. మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌ ఇద్దరు వచ్చినా.. ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్ మోదీ రాకపోవడం అందరిలో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. 'మోదీ రాకపోవడం ఏంటి, మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌ రావడం ఏంటి' అని ఒకరు కామెంట్ చేయగా.. 'మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో తెగ ఎంజాయ్ చేస్తుందిగా' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రోహ్మాన్‌ షాల్‌తో మళ్లీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు సుస్మితా. ఇంతకు సుస్మితా ఎవరితో డేటింగ్ చేస్తుందని అందరూ అయోమయానికి గురవుతున్నారు. 

Also Read: Rashmika Mandanna Pics: రష్మిక మందన్న హాట్ అలెర్ట్.. క్లీవేజ్ అందాలతో మతిపోగోడుతుందిగా!

Also Read: మాళవిక మోహనన్ క్లీవేజ్ షో.. శారీలోనూ సెగలు రేపుతున్న మలయాళ బ్యూటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News