Godfather box office collection Day 3 World Wide: మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ తెలుగు రీమేక్ గా దీన్ని రూపొందించారు ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేయగా సినిమాలో సల్మాన్ ఖాన్, నయన తార, సునీల్, సత్యదేవ్, సముద్రఖని వాటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పూర్తిగా సినిమాని మక్కీకి మక్కి దించేయకుండా తెలుగు ఆడియన్స్ మెచ్చే విధంగా కొన్ని ఆసక్తికరమైన మార్పులు చేయడంతో సినిమా మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక గాడ్ ఫాదర్ సినిమా వసూళ్లను విషయంలో కూడా జోరు చూపిస్తోంది. ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా 13 కోట్ల వరకు షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో సాధించగా రెండో రోజు కూడా దాదాపు ఏడు కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది.


మూడవరోజు కూడా గట్టిగానే వసూళ్లు వస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఏకంగా మూడో రోజు కూడా అయిదు కోట్ల 50 లక్షల వరకు షేర్ రాబట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో మూడవరోజు కోటి రూపాయల అరవై లక్షల షేర్ రాబట్టిందని అలా మూడు రోజులకు గాను ఏడు కోట్ల 15 లక్షలు వసూలు చేసినట్లు అయిందని అంటున్నారు. మూడవరోజు కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయని ఐదున్నర కోట్ల దాకా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


ఇక నాలుగవ రోజు అంటే ఈరోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయని శనివారం కావడంతో పాటు సెలవు దినం కూడా కావడంతో బుకింగ్స్ బాగానే జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 


మూడో రోజు కలెక్షన్స్
నైజాం : 1.68 కోట్లు
సీడెడ్ : 1.13 కోట్లు
ఉత్తరాంధ్ర: 89 లక్షలు 
ఈస్ట్ గోదావరి: 42 లక్షలు 
వెస్ట్ గోదావరి: 29 లక్షలు 
గుంటూరు: 38 లక్షలు 
కృష్ణ: 36 లక్షలు 
నెల్లూరు: 26 లక్షలు 
ఏపీ- తెలంగాణలో కలిపి :- 5.41 కోట్లు షేర్ (8.75 కోట్లు గ్రాస్)
 
మూడు రోజులకు కలిపి 


నైజాం : 7.35 కోట్లు
సీడెడ్ : 1.13 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.16 కోట్లు 
ఈస్ట్ గోదావరి: 22.53 కోట్లు
వెస్ట్ గోదావరి: 1.33 కోట్లు
గుంటూరు: 2.73 కోట్లు
కృష్ణ: 1.58 కోట్లు
నెల్లూరు: 1.16 కోట్లు
ఏపీ- తెలంగాణలో కలిపి :- 26.11 కోట్లు షేర్ (43.50 కోట్లు గ్రాస్)
కర్ణాటక- 2.65 కోట్లు 
హిందీ సహా ఇండియా మొత్తం తెలుగు వర్షన్ – 2.50 కోట్లు
ఓవర్ సీస్ – 3.10 కోట్లు 
ప్రపంచవ్యాప్తంగా – 34.36 కోట్ల షేర్ (62.55 కోట్ల గ్రాస్) 
 


Also Read: Shivatmika Sizzling Photos: రాజశేఖర్ చిన్న కూతురు పరువాల విందు.. ఎక్కడా తగ్గట్లేదుగా?


Also Read: Neha Sharma Hot Photos: బెడ్ మీద రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ.. లోదుస్తులు కనిపించేలా హాట్ షో!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook