Godse Movie Trailer: అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి.. పద్దతి ఉన్నోడే పార్లమెంట్‌టో ఉండాలి! మర్యాద ఉన్నోడే..
Satya dev, Aishwarya Lekshmi`s Godse Official Trailer released. జూన్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా జూన్ 9 గాడ్సే ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.
Satya dev, Aishwarya Lekshmi's Godse Official Trailer released: టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ తాజాగా నటించిన తాజా చిత్రం 'గాడ్సే'. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. గాడ్సే సినిమాలో మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె తెలుగులో నటించడం ఇదే మొదటిసారి. జూన్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా గురువారం (జూన్ 9) గాడ్సే ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.
గాడ్సే ట్రైలర్ ఒక నిమిషం 52 సెకండ్లు ఉంది. 'ధర్మో రక్షితి రక్షత: అంటారు. కానీ సమాజంలో సత్యం, ధర్మం ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. 'పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చింది ఎంత?, అప్పుల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చింది ఎంత?, గ్రౌండ్ రియాలిటీలో ఖర్చు పెట్టింది ఎంత?, సూట్ కేసు కంపెనీలకు తరలించినది ఎంత?', 'ప్రశ్నిస్తే.. మారణకాండ చేసేస్తారా?', 'అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి, పద్దతి ఉన్నోడో పార్లమెంట్‌లో ఉండాలి, మర్యాద ఉన్నోడే మేయర్ కావాలి, సబ్జెక్ట్ ఉన్నో సర్పంచ్ కావాలి' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం గాడ్సే అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అవినీతిమయమైన రాజకీయ నాయకులను, వ్యవస్థను ఒక్కడే ఎదుర్కొనే పాత్రలో సత్యదేవ్ నటించినట్లు అర్ధమవుతోంది. ఐశ్వర్య లక్ష్మి పవర్ ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ రోల్ చేశారు. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. జూన్ 17న సినిమా విడుదల ఈసినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు శాండీ అడ్డంకి సమకూర్చారు. బ్లఫ్ మాస్టర్ వంటి విజయవంతమైన సినిమా తర్వాత గోపి గణేష్ పట్టాభి, సత్యదేవ్ కాంబోలో ఈ సినిమా వస్తోంది.
Also Read: Babar Azam Record: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు బద్దలు.. తొలి కెప్టెన్‌గా బాబర్ ఆజమ్!
Also Read: Gayatri Jayanti 2022 Mantra: ఆర్థిక కష్టాలు తీరాలంటే.. జూన్ 11న ఈ 24 అక్షరాలు జపిస్తే చాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook