Ap Free Rice: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్.. మూడు నెలలు ఫ్రీ
Free Rice Distribution: ఏపీలో పేదలకు మరో నెలల పాటు ఉచితంగా రేషన్ బియ్యం అందనున్నాయి. ఏయే జిల్లాలో ఏ బియ్యం పంపిణీ చేస్తున్నారో వివరాలు ఇలా..
Free Rice Distribution: ఆంధ్రప్రదేశ్‌లోని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (PMGKAY) పథకం కింద మూడ నెలల పాటు ఉచితంగా బియాన్ని సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జాతీయ ఆహార భద్రత కార్డుదారులు ఈ బియాన్ని ప్రతి నెల 19వ తేదీ నుంచి 28వ తేదీలోగా రేషన్ దుకాణాల వద్ద తీసుకోవాలని అధికారులు సూచించారు. ఒక్కో వ్యక్తికి ఐదు కిలలో చొప్పున పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 2.68 కోట్ల మంది ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులు ఉన్నారని.. వారి జాబితాను రేషన్ దుకాణాలు, సచివాలయాల వద్ద ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం నాన్ సార్టెక్స్, నాన్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అంబేడ్కర్ కోనసీమ, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో నాన్ సార్టెక్స్ బియ్యం సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. మిగిలిన 16 జిల్లాలో నాన్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీని వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నాటికి అన్ని జిల్లాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
ఫోర్టిఫైడ్ బియ్యం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12 పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ బియ్యం తేలికగా ఉండడంతో నీటిలో తేలుతాయి. ఈ బియ్యాన్ని కొందరు ప్లాస్టిక్ బియ్యం అని భ్రమ పడుతున్నారు. ఏపీలో 9,260 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వేలి ముద్రల సాయంతో బియ్యం అందజేస్తున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎలాంటి లోపాలు, అక్రమాలు జరగకుండా అధికారులు పక్కాగా చర్యలు చేపడుతున్నారు. ఫిర్యాదుల కోసం 1902 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసి పారదర్శంగా వ్యవహరిస్తున్నారు.
Also Read: మేషరాశిలో చంద్రగ్రహణం... ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి..
Also Read: సుధీర్ తో ప్రేమో? స్నేహమో? ఎందుకు చెప్పాలి.. కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్న రష్మి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo