OTT Movies 2024: సంక్రాంతి అంటే చాలు పెద్ద, చిన్న సినిమాలు వరుసగా విడుదలవుతుంటాయి. థియేటర్లతో పాటు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న ఓటీటీల్లో కూడా కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అందులో భాగంగా కళ్యాణ్ రామ్, నిఖిల్, కింగ్ నాగార్జున సినిమాలు ఓటీటీలో విడుదలౌతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ నటుడు నితిన్, నటి శ్రీలీల జంటగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ డిసెంబర్ 8న థియేటర్ విడుదలైంది. ఈ యాక్షన్ కామెడీ సినిమా ఎందుకో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు జనవరి 19న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా కధ, కధనంలో ఆసక్తిగా ఉండదు. కధ ఎక్కడో మొదలై మరెక్కడికో దిశా నిర్దేశం లేకుండా సాగినట్టన్పిస్తుంది. ఎక్కడా లాజిక్ లేకుండా ఉంటుంది. బహుశా అందుకే థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మరి ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. 


ఇక నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా నిన్న రాత్రి నుంచి ఓటీటీలో వచ్చేసింది. డిసెంబర్ 29న విడుదలైన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నా ఆశించిన మేర నిలబడలేకపోయింది. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ జనవరి 14 అంటే ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. పీరియాడిక్ థ్రిల్లర్‌గా రూపొందిన డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ నటించింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చగా అభిషేక్ నామా తెరకెక్కించాడు. మాళవిక నాయర్, అజయ్, సత్య ఇతర కీలక పాత్రల్లో కన్పిస్తారు. 


ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున, ఆషికా రంగనాథ్ నటించిన నా సామిరంగా సినిమాను ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌లు కీలక పాత్రల్లో కన్పిస్తారు. మీర్నా మీనన్, రుక్సాన్ దిల్లాన్‌లు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలో సినిమా హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది


Also read: Jagananna Agenda Song: సోషల్ మీడియాలో వైరల్ అవుతన్న జగనన్న అజెండా పాట



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook