Jagananna Agenda Song: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జగనన్న అజెండా పాట

Jagananna Agenda Song: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మార్పులు చేర్పులతో అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తూ దుసుకుపోతోంది. మరోవైపు ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని విడుదలైన జగనన్న ఎజెండా పాట వైరల్ అవుతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 14, 2024, 11:09 AM IST
Jagananna Agenda Song: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జగనన్న అజెండా పాట

Jagananna Agenda Song: ఏపీ ఎన్నికల వేళ అధికార పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో దూసుకుపోతోంది. ఏ చిన్న పొరపాటు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు, సమీకరణాలతో గెలుపు గుర్రాల్ని సిద్ధం చేస్తోంది. అందుకే భారీగా అభ్యర్ధుల్ని మార్చేస్తోంది. చాలామంది సిట్టింగులకు టికెట్ నిరాకరిస్తోంది. 

ఓ వైపు అభ్యర్ధుల కసరత్తు చేస్తూ జాబితాలు విడుదల చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు డిజిటల్ ప్రచారానికి తెరలేపింది. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఆలోచించపజేసే లిరిక్స్‌తో, ఉర్రూతలూగించే బాణీతో అద్భుతమైన పాటను విడుదల చేసింది. జగనన్న ఎజెండా పేరుతో విడుదలైన ఈ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వేదికలపై భారీగా షేర్ చేస్తున్నారు. ఓ వైపు పాట, మరోవైపు జగన్ వ్యాఖ్యలతో పాట సాగుతుంది. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున్నాడు, చెప్పుకోడానికి ఏమీ లేనివాళ్లంతా ఏకమౌతున్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలవండి, మీరే సైనికులుగా కదలండి అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలతో పాట మొదలవుతుంది. ఈ పాటను నల్గొండ గద్దర్ తనదైన శైలిలో పాడి ఆకట్టుకుంటున్నారు. 

ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన తమ్మున్నడు జగన్ అంటూ సాగే ఈ పాటకు అద్భుతంగా స్పందన లభిస్తోంది. జెండలు జత కట్టడమే మీ అజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా అనే పాట అందర్నీ ఆలోచింపజేస్తోంది.

అటు జగన్ చేసిన పథకాల్ని గుర్తు చేయడమే కాకుండా ప్రతిపక్షాల తీరును ఎండగట్టతూ ఈ పాట సాగుతుంది. మధ్యమధ్యలో జగన్ ప్రసంగంలోని వ్యాఖ్యలు పాటకు హైలైట్‌గా నిలుస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల నేపధ్యంలో విడుదలైన మొదటి పాట జనంలో దూసుకుపోతోంది

Also read: Supreme Court Judgement: స్కిల్ క్వాష్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎల్లుండే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News