Google Co Founder Sergey Brin files Divorce: ప్రపంచ కుబేరుల గురించి నిత్యం వార్తలు చదువుతూనే ఉంటాం. వారి సంపాదన ఇంత, వారి వార్షిక ఆదాయం ఇంత, సెకనుకి అంత సంపాదిస్తుంటారు అని వార్తలు సహజంగా వస్తుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచ కుబేరులు అంటే వారి విడాకుల వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. విడాకులు తీసుకుంటున్న ప్రపంచ కుబేరుల జాబితా అలా పెరుగుతూనే పోతోంది. ఇది వరకే బిల్ గేట్స్ దంపతులు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ జంట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలోకి ఇప్పుడు గూగుల్ సహా వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ చేరిపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలోని కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న సెర్జీ బ్రిన్.. తాజాగా విడాకుల కోసం దరఖాస్తు చేశారట. మూడేళ్ల క్రితం నికోల్ షనాహాన్‌ను వివాహాం చేసుకున్న సెర్జీ బ్రిన్.. ఇంతలోనే తన వివాహా బంధానికి ముగింపు పలికేస్తున్నారట. సెర్జీ బ్రిన్ వరుసగా మెగా బిలియనర్ల జాబితాలో ఉంటూ వార్తల్లో నిలవగా.. ఇప్పుడు విడాకుల విషయంలో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. అభిప్రాయా విబేధాల వల్లే విడాకులు తీసుకుంటున్నారని కోర్టు తెలిపింది. 


సర్జీ బ్రిన్‌-నికోల్ షనాహాన్‌కు 2018లో సన్నిహితులు సమక్షంలో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మిగతా వివరాలను ఎంతో గోప్యంగా ఉంచాలని కోర్టు కూడా భావిస్తోందట. అయితే తమ లాంటి వ్యక్తులు విడాకులు తీసుకుంటున్నారంటే.. ప్రజలు ఎంతో ఆసక్తికరంగా చూస్తుంటారని, తమ పిల్లాడి విషయాలు, తమ వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయకండని కోరినట్టు తెలుస్తోంది.


సెర్జీ బ్రిన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంది. గతంలో 2007లో అన్నే వొజిస్కీని ఆయన పెళ్లాడాడు. 2015లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత షనాహాన్‌తో మూడేళ్లు సహజీవనం చేసి.. 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగేళ్లకే విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరి పేరు నెట్టింట మార్మోగిపోతోంది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం సెర్జీ బ్రిన్ సంపద దాదాపు రూ.7 లక్షల కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఎక్కువ శాతం గూగుల్‌ సంస్థలో వాటాలు ఉన్నాయి. 


Also Read: Virat Kohli: పదేళ్ళ నాటి ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ ఎందుకవుతుంది, కోహ్లీపై వ్యాఖ్యలు


Also Read: Shahid Afridi BCCI: బీసీసీఐ ఏం చెబితే.. క్రికెట్‌ ప్రపంచంలో అదే జరుగుతుంది! షాహిద్‌ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook