Bhimaa Trailer Release: చాలా రోజుల నుంచి మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్.. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా.. పరశురాముని గుడిని కాపాడే యోధుడిగా సూపర్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను ఎంటర్ చేయడానికి రెడీగా ఉన్నాడు అన్న విషయం భీమా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రైలర్ లో గోపీచంద్ పై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు హైలెట్గా నిలిచాయి. కన్నడ మాస్ డైరెక్టర్ హర్ష డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం కచ్చితంగా గోపీచంద్ కి ఓ మంచి హిట్ అందిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భీమా మూవీలో గోపీచంద్ మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో బాగా సెట్ అయ్యాడు. మామూలుగా హర్ష డైరెక్షన్లో హీరోలు ఎంతో పవర్ఫుల్ గా ఉంటారు.మరి అలాంటి డైరెక్టర్ ..గోపీచంద్ లాంటి భారీ కట్ అవుట్ ఉంటే హీరో తో మూవీ చేస్తే ఇక ప్రేక్షకులకు గూస్ బంప్స్ కన్ఫామ్. ఒక ట్రైలర్ తోనే బీమా మంచి పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అన్న విషయం స్పష్టంగా అర్థం అయిపోయింది .దీంతో రాబోయే చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.


ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ఆడియన్స్ ని బాగా మెప్పించాయి. ఒక చిన్న టీజర్ తోటే డైరెక్టర్ ప్రేక్షకులలో ఈ చిత్రంపై మంచి అంచనాలు క్రియేట్ చేశారు. మరి ఇప్పుడు ట్రైలర్ లో భారీ యాక్షన్ సన్నివేశాలతో మంచి విజువల్ ట్రీట్ ఇస్తూ అంచనాలను మరింత పెంచేశారు. ఈ మూవీలో గోపీచంద్ సరసన ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కావలసి ఉంది. అయితే కొన్ని కారణాలవల్ల శివరాత్రి సందర్భంగా ఈ చిత్రాన్ని మార్చి 8న విడుదల చేయబోతున్నారు మేకర్స్.


 



ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇందులో గోపీచంద్ పవర్ ఫుల్ లుక్ తో పాటు మాస్ సీక్వెన్స్ ,డైలాగ్స్ అదరగొట్టే విధంగా ఉన్నాయి. మొత్తం 32 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో మొదటి 20 సెకండ్లు హీరో అసలు కనిపించదు. ఇక ఈ ట్రైలర్ లో పరశురాముడు, శివుడు గురించి ప్రస్తావించి మంచి మైథలాజీకల్ టచ్ ఇచ్చారు. ట్రైలర్ లో అఘోరాలను శివుడి ఆలయాన్ని చూపించడం.. మహావిష్ణువు ఆరవ అవతారం పరశురాముడు ఉపయోగించినటువంటి కండ్రగొడ్డలి తో సృష్టించిన పరశురాముడు క్షేత్రం గురించి చెప్పడం.. మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి. 


విర్రవీగుతున్న రాక్షసుల అహంకారాన్ని అణిచివేయడానికి పరశురాముడు ఒక బ్రహ్మ రాక్షసుడుని పంపాడు అంటూ వచ్చే పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇక  ట్రైలర్ లాస్ట్ లో.. నేను ఉచ్చ కోత మొదలుపెడితే ఈ ఊళ్లో స్మశానం కూడా సరిపోదు అంటూ గోపీచంద్ చెప్పే మాస్ డైలాగ్ మరింత హైలెట్గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్ మూవీపై భారీ అంచనాలను నిలపడుతుంది అనడంలో డౌట్ లేదు. ఈ మూవీతో అయినా గోపీచంద్ ఖాతాలో మంచి సక్సెస్ పడుతుందేమో చూడాలి.


Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్‌ స్కామ్‌లో కవిత అరెస్ట్‌ తప్పదా?


Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్‌ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్‌, రుణమాఫీ ఎప్పటినుంచంటే?


 



 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook