Morning Show: జిఆర్ మహర్షి ‘మార్నింగ్ షో’ పుస్తక ఆవిష్కరణ…హాజరైన దర్శకులు..
GR Maharshi: పుస్తకాలు.. మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేస్తూ మనకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. జీవితంలో మనం ఏం అవ్వాలన్నా దాని గురించి ముందుగా అవగాహన ముఖ్యం. ఈ నేపథ్యంలో ఇదే ఫాలో అవుతూ సీనియర్ జర్నలిస్ట్ తన అనుభవాలన్నీ ఒక పుస్తకంగా రాశారు..
Morning Show: మనిషి జీవితంలో ప్రస్తుతం సినిమాలు కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి అన్నడం లో సందేహం లేదు. పనులతో బిజీ బిజీగా ఉందే మనుషులకు సినిమాలనేవి ఒక మంచి రిలాక్సేషన్ గా పనిచేస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుంచీ చూసిన సినిమాల గురించి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఆ స్పందనను రికార్డ్ చేస్తారు. అలా.. సుదీర్ఘ కాలంగా సినిమా జర్నలిస్ట్ గా తనకున్న అనుభవాలు, అనుభూతులతో పాటు చిన్నప్పటి నుంచీ తను చూసిన సినిమా విశేషాలు, సంగతులను గురించి ఎంతో చక్కగా తన పదాలతో తెలియజేస్తూ సీనియర్ జర్నలిస్ట్ జీఆర్ మహర్షి ‘ మార్నింగ్ షో’ అనే పుస్తకాన్ని రాశారు.
దాదాపు 50 సంవత్సరాలుగా తను చూసిన సినిమాలతో పాటు పరిశ్రమలోని మార్పులు, కథ, కథనాల్లో వచ్చిన మార్పులను గురించి వర్ణిస్తూ ఈ పుస్తకాన్ని జమిలి సాహిత్య, సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో దర్శకుడు కుమారస్వామి(అక్షర) ప్రచురించారు.
ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం తాజాగా హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పుస్తక ఆవిష్కరణ కి ఎంతోమంది పేరుగాంచిన వ్యక్తులు హాజరయ్యారు. ముందుగా ఈ ఆవిష్కరణలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ‘‘ షరతులు వర్తిస్తాయి సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్న కుమార స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. కుమారస్వామి ఎంతో కష్టపడి, నిబద్ధతతో ఈ పుస్తక ముద్రణ కోసం శ్రమించారు. అంతకంటే ఎక్కువగా తన షరతులు వర్తిస్తాయి సినిమా కోసం కృషి చేశారు. త్వరలో విడుదల కాబోతోన్న ఆ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఇక జిఆర్ మహర్షి గారితో నాకు చాలాకాలంగా పరిచయం ఉంది. వారు చిన్న తనం నుంచీ చూసిన సినిమాల సంగతులను తనకే సొంతమైన ఒక సెటైరికల్ వేలో రాశారు. ఈ పుస్తకం కేవలం సినిమా విశేషాలను గురించి మాత్రమే కాదు.. అనేక ఆలోచనలను కలిగించేలా ఉంది. ఒక్కసారి చదవడం మొదలుపెడితే.. ఇంక పుస్తకం చదవడానికి ఆపలేము. అంత గొప్పగా మహర్షి గారు ఈ పుస్తక రచన చేశారు. సాహిత్యం, సంస్కృతి కలయికే సినిమా. ఏ సినిమా కథైనా మొదట పుట్టేది పేపర్ పైనే. ఆ కథ రాసిన రచయితే మొదటి ప్రేక్షకుడు. అందుకే సాహిత్యం లేనిదే కళ కూడా లేదు అంటాను. ఈ పుస్తకం ద్వారా ఇప్పటి వరకూ సినిమా రంగంలో వచ్చిన అనేక మార్పులను మనకు పరిచయం చేశాడు రచయిత. ఇలాంటి పుస్తకాన్ని మనందరి ముందుకూ తెస్తున్న కుమార స్వామిని మరోసారి అభినందిస్తూ.. సెలవు..’’ అని తెలియజేశారు.
ఆ తరువాత దర్శకుడు సాగర్ కే చంద్ర మాట్లాడుతూ.. ‘‘ ముందుగా దర్శకుడుగా పరిచయం అవుతున్న కుమార స్వామికి కంగ్రాట్యులేషన్స్. మేం ఇంతకు ముందు కలిసి పనిచేశాం. జిఆర్ మహర్షి గారితో నాకు పరిచయం ఉంది. నా కథకు సంబంధించి ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు దీనికి క్లారిటీ ఎవరిస్తారా అని కుమారస్వామిని అడిగాను. అతనే నాకు ఈయన్ని పరిచయం చేశాడు. మహర్షిగారు చెప్పిన మార్పులు నా కథకు చాలా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు చేస్తోన్న సినిమా కథే అది. ఇక ఈయన పుస్తకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రస్తుతం నేనూ ఆయన రాసిన పుస్తకాలు చదివే పనిలో ఉన్నాను. ఈ మార్నింగ్ షో బుక్ ప్రతి ఒక్కరూ చదవాలి. ’’ అని తెలియజేశారు.
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ షరతులు వర్తిస్తాయి అనే సినిమాతో దర్శకుడుగా మారిన కుమార స్వామికి నా అభినందనలు. అతన్నుంచి ఓ మంచి సినిమా వస్తుందని ఆశిస్తున్నాను. ఈ పుస్తకానికి మార్నింగ్ షో అనే టైటిల్ పెట్టడం చూస్తేనే మహర్షికి సినిమా పట్ల ఎంత మమకారం ఉందో అర్థం అవుతోంది. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని కోరుకుంటున్నాను .. ’’ అన్నారు.
ఇక చివరిగా జమిలి సాహిత్య, సాంస్కృతిక వేదిక ప్రతినిధి కుమారస్వామి(అక్షర) మాట్లాడుతూ.. ‘‘సాహిత్యం, సాంస్కృతిం రెండూ గొప్ప ప్రయాణాలు. ఈ రెండు చోట్లా నేను ఉండటానికి కారణం సాహిత్యమే. జమిలి లక్ష్యానికి తగ్గట్టుగానే ఈ పుస్తకాన్ని ప్రచురించాం. ఇక్కడికి వచ్చిన వారందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ మార్నింగ్ షో మీ అందరు చదివి ఆదరిస్తారని కోరునుకుంటున్నాను.. ’’ అన్నారు.
Also read: AP Cabinet 2024: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మూడు ప్రైవేట్ వర్శిటీలకు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook