Jr NTR American English Accent హాలీవుడ్ గడ్డ మీద మన ఇండియన్ సినిమా, టాలీవుడ్ సత్తా చాటారు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. త్వరలోనే ఆస్కార్ అవార్డ్ కూడా వస్తుందనే అంతా అనుకుంటున్నారు. అయితే ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వేడుకల్లో మన స్టార్లు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ మేగజైన్ వెరైటీ సంస్థతో అక్కడ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు చెర్రీ, తారక్. అయితే ఇందులో తారక్ మాత్రం ఇంగ్లీష్‌ యాక్సెంట్‌లో అదరగొట్టేస్తున్నాడు. అక్కడి రిపోర్టర్లకు బర్త్ డే సర్ ప్రైజ్ గిఫ్టులు కూడా ఇచ్చేశాడు. అమెరికన్ స్లాంగ్‌లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.


 



ఎన్టీఆర్ మాట్లాడిన యాస మీద నెటిజన్లు కొంత మంది ట్రోలింగ్‌కు దిగారు. అయితే దీనిపై కస్తూరీ శంకర్ ఘాటుగా స్పందించింది. ఇంతకు ముందు ఎన్టీఆర్ ఇంగ్లీష్‌లో మాట్లాడిన మాటలు, వీడియోలు, ఇంటర్వ్యూలు ఉంటేపెట్టండని నెటిజన్లు అడిగింది. దీంతో ఎన్టీఆర్ పాత వీడియోలు షేర్ చేశారు. దాంట్లోనూ ఎన్టీఆర్ ఇంగ్లీష్‌లో అదరగొట్టేశాడు.


దీంతో కస్తూరీ శంకర్ ఎన్టీఆర్ మీద జరుగుతున్న ట్రోలింగ్‌ను తిప్పి కొట్టేసింది. అమెరికన్ యాసలో ఎన్టీఆర్ బాగా మాట్లాడాడు.. ఆయన ఎంతో కష్టపడ్డాడు.. స్థానిక భాషలో మాట్లాడి అక్కడి జనాలతో కనెక్ట్ అవ్వాలని చూస్తున్నాడు.. అద్భుతంగా మాట్లాడాడు.. అది ఆయనకు పుట్టుకతో వచ్చిన వరం అంటూ ఎన్టీఆర్‌ను పొగిడేసింది. గతంలో జపాన్‌ భాషలో ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. ఆర్ఆర్ఆర్ కోసం దేశమంతా తిరిగినప్పుడు స్థానిక భాషల్లో ఎన్టీఆర్ దుమ్ములేపేసిన సంగతి తెలిసిందే.


Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్


Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి