Guntur Kaaram:`గుంటూరు కారం` సినిమాకు అక్కడే మడతడి పోయిందా.. ? తలలు పట్టుకున్న మహేష్, త్రివిక్రమ్..
Guntur Kaaram: సంక్రాంతి సీజన్లో భారీ అంచనాలతో విడుదలైంది మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల గుంటూరు కారం. ఈ మూవీకి విడుదలకు ఒక రోజు ముందు ఫ్యాన్స్ కోసం ప్రీమియర్స్ వేసారు. అక్కడ నుంచే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ ప్రారంభమైంది. అది ఈ మూవీ కలెక్షన్స్ పై పడింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన విధంగా పర్ఫామ్ చేయకపోవడానికి మరో పెద్ద రీజనే ఉంది.
Mahesh Babu - Trivikram - Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన మూడో సినిమా 'గుంటూరు కారం'. సంక్రాంతి సినిమాల్లో భారీ ఎక్సెపెక్టెషన్స్తో విడుదలైన గుంటూరు కారం ఫస్ట్ డే మిక్స్డ్ టాక్‌తో మొదలైంది. మొదటి రోజు మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు త్రివిక్రమ్ స్టార్ డమ్ వంటివి ఈ సినిమాకు బాగానే కలిసొచ్చి సాలిడ్ వసూళ్లను రాబట్టింది.అంతేకాదు రూ. 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో నాన్ ప్యాన్ ఇండియా క్యాటగిరిలో హైయ్యెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. మరోవైపు ఈ సినిమాకు పోటీగా విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఇప్పటికీ దుమ్ము దులుపుతూ ఉంది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ సినిమా దూకుడును సైతం తట్టుకుంటూ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది.మరోవైపు ఈ సినిమాకు ఈ ఫలితం రావడంపై అందరు గురూజీ (త్రివిక్రమ్) వైపు వేలెత్తి చూపెడుతున్నారు.
బడా స్టార్ హీరోను పెట్టుకొని కేవలం సింగిల్ లైన్ పాయింట్ తో ఈ సినిమాను చుట్టేసాడనే చెడ్డ పేరు త్రివిక్రమ్ కు వచ్చింది. తల్లితో కుమారుడికి ఎలాంటి సంబంధం లేదంటూ ప్రామిసరి నోట్ రాసి ఇవ్వడంపైనే ఈ సినిమాను నడింపించాడు. అందులో మహేష్ బాబు మాస్ క్యారెక్టర్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ పాత్రను డిజైన్ చేసాడు. అంతేకాదు మహేష్ బాబును కొత్తగా చూపించడంతో పాటు పోకిరి తరహాలో వింటేజ్ లుక్ పై పెట్టిన శ్రద్ధ కథ, కథనాలపై పూర్తిగా కేటాయించ లేకపోయాడు గురూజీ. మొత్తంగా త్రివిక్రమ్ ఈ సినిమాను మహేష్ బాబు భుజ స్కంధాలపై ఉంచాడు. ఆయన నమ్మకాన్ని మహేష్ బాబు నిలబెట్టాడు.మొత్తంగా పండగ సీజన్లో ఇలాంటి టాక్‌తో ఈ సినిమా దాదాపు 80 శాతం రికవరీ సాధించడం వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు పండగ సీజన్ కూడా కలిసి వచ్చింది.
సంక్రాంతి వండి బడా సీజన్లో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదంటురు ట్రేడ్ పండితులు. ఐతే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన విధంగా పర్ఫామ్ చేయకపోవడానికి మరో పెద్ద రీజనే ఉంది. ఈ మూవీ ప్రీమియర్స్ రోజునే కొన్ని చోట్ల HD ప్రింట్స్ బయటకు రావడం ఈ సినిమాకు మైనస్‌కు మారింది. అది వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్ల విషయానికొస్తే..
తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 87.69 కోట్లు..షేర్ రాబట్టింది.
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ ..రూ. 6.47 కోట్లు..
ఓవర్సీస్.. రూ. 14.61 కోట్ల షేర్ రాబట్టింది.
మొత్తంగా మొదటి వారం పూర్తయ్యే సరికి గుంటూరు కారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 108.75 కోట్ల షేర్ (రూ. 178.35 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇక చిత్ర యూనిట్ మాత్రం ఈ మూవీ రూ. 230 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు పేర్కొంది.
గుంటూరు కారం సినిమా రూ. 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్డర రూ. 24.25 కోట్ల రాబడితే హిట్ అనిపించుకుంటుంది. టోటల్‌గా పండగ సీజన్ ముగిసిన నేపథ్యంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఇపుడు దాదాపు అసాధ్యమే అని చెప్పాలి.
Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?
Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్ఎస్ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook