Hansika Sohael Khaturiya Marriage : హన్సిక తాజాగా తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించేసింది. పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నౌ అండ్ ఫరెవర్ అంటూ పెళ్లి డేట్‌ను చెప్పింది. డిసెంబర్ నాలుగో తేదీన పెళ్లి అయినట్టు ప్రకటించింది హన్సిక. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హన్సిక పెళ్లికి సంబంధించిన విషయాలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. నవంబర్ నుంచి హన్సిక పెళ్లి రూమర్లు వైరల్ అవుతూనే వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవంబర్ నుంచి హన్సిక పెళ్లి మీద ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే వచ్చింది. కానీ హన్సిక మాత్రం ఎప్పుడూ తన పెళ్లి మీద అధికారికంగా స్పందించలేదు. హన్సిక పెళ్లి కోసం రాజస్థాన్‌లోని కోటను బుక్ చేశారంటూ వార్తలు వచ్చాయి. కానీ హన్సిక మాత్రం అధికారికంగా స్పందించలేదు. ఇక హన్సిక పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్‌గా మారుతూనే వచ్చాయి. హన్సికకు సోహెల్ ప్రపోజల్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో అందరినీ ఆకట్టుకున్నాయి.


 



ఇక ఇప్పుడు హన్సిక తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను చూసి నెటిజన్లు, సెలెబ్రిటీలు హన్సికకు కంగ్రాట్స్ చెబుతున్నారు. సందీప్ కిషన్, ఇషా గుప్తా, మందిరా బేడీ, శ్రియా రెడ్డి, శీతల్ రాబిన్ ఊతప్ప, తన్వీ షా, కరణ్‌ టేకర్‌ ఇలా అందరూ కంగ్రాట్స్ చెబుతూ వస్తున్నారు.


హన్సిక ఇప్పుడు కోలీవుడ్‌లోనే బిజీగా ఉంటోంది. టాలీవుడ్‌లో హన్సికకు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. బాలీవుడ్‌లోనూ హన్సికకు మంచి ఆఫర్లు వచ్చాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సికకు.. తెలుగులో దేశ ముదురు సినిమాతోనే హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు హన్సిక తన కెరీర్‌లో యాభైవ సినిమాకు రెడీ అవుతోంది. పెళ్లి తరువాత కూడా సినిమాలను కంటిన్యూ చేసేలానే కనిపిస్తోంది.


Also Read : Janhvi Kapoor Drinking : తప్పతాగి వచ్చావా?.. జాన్వీ కపూర్ మీద ట్రోలింగ్.. నెటిజన్ల కామెంట్లు వైరల్


Also Read : Anchor Anasuya : ఇన్నాళ్లు బతిమిలాడా.. ఇకపై యాక్షనే.. కేసులపై వదలనంటోన్న అనసూయ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook