Hansika Sri Gandhari Movie: హర్రర్ సినిమాలకు ఎప్పుడు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఇటీవల హర్రర్‌ కామెడీ సినిమాలకు భారీ క్రేజ్ ఏర్పడింది. నవ్విస్తునే భయపెట్టే చిత్రాలకు ఆడియన్స్ పట్టం కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అందాల తార హన్సిక ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. శ్రీ గాంధారి మూవీ ద్వారా త్వరలోనే తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. ఆర్‌.కన్నన్ దర్శకత్వం వహిస్తూ.. మసాలా పిక్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఈ సినిమాను తెలుగులోకి రాజు నాయక్ రిలీజ్ చేస్తున్నారు. వీకేఆర్ (విక్రమ్ కుమార్ రెజింతల) సమర్పణలో సరస్వతి డెవలపర్స్‌తో కలిసి లచ్చురం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Venom Lizards: పాముల కన్నా అత్యంత విషపూరిత బల్లులు.. ఎరుపు రంగులో ఎప్పుడైనా చూశారా?


గంధర్వ కోట బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పురాతన స్మారకానికి సంబంధించిన పరిశోధన చేపట్టినప్పటి నుంచి స్టోరీ మొదలవుతుంది. ఓ రాజు నిర్మించిన ఈ కోటలో ఎన్నో రహాస్యాలు ఉన్నాయి. ఆ రహాస్యాలను ఎలా వెలుగులోకి తీసుకువచ్చారనేది మెయిన్ స్టోరీ. ఈ చిత్రంలో హిందూ ట్రస్ట్ కమిటీకి హెడ్ ఆఫీసర్‌ రోల్‌లో హన్సిక యాక్ట్ చేశారు. ఆమె ఈ ప్రాజెక్ట్‌ను టేకాప్ చేస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. డిఫరెంట్‌ లుక్‌లో హన్సిక కనిపించడం.. యాక్టింగ్ కొత్తగా ఉండడంతో ప్రేక్షకులకు సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. 


మెట్రో శిరీష్, మయిల్‌సామి, తలైవాసల్ విజయ్, ఆడుకాలం నరేన్, స్టంట్ సిల్వా, వినోదిని, పవన్, బ్రిగిడా సాగా, వడివేల్ మురుగన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తొల్కప్పియన్ కథను అందించగా.. స్క్రీన్ ప్లేని ధనంజయన్ చూసుకున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా బాల సుబ్రమణియన్ వర్క్ చేయగా.. మ్యూజిక్ కంపోజర్‌గా ఎల్వీ గణేష్ ముత్తు పనిచేశారు. ఎడిటింగ్ బాధ్యతలు జిజింత్ర నిర్వర్తించారు. సిల్వా స్టంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను డిసెంబర్‌లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు రాజు నాయక్ ప్లాన్ చేస్తున్నారుఉ. 


టెక్నికల్ టీమ్:


==> బ్యానర్ : సరస్వతి డెవలపర్స్‌, లచ్చురం ప్రొడక్షన్స్
==> ప్రొడ్యూసర్ (తెలుగు) : రాజు నాయక్
==> సమర్పణ : వీకేఆర్ (విక్రమ్ కుమార్ రెజింతల)
==> డైరెక్టర్ : ఆర్ కన్నన్
==> మ్యూజిక్ : ఎల్వీ గణేష్ ముత్తు
==> కెమెరామెన్ : బాల సుబ్రమణియన్
==> ఎడిటర్ : జిజింత్ర
==> PRO : సాయి సతీష్


Also Read: Pawan Kalyan: ఎర్రచందనంపై పవన్ కళ్యాణ్‌ కొత్త ఐడియా.. కేంద్రానికి రిక్వెస్ట్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.