Hanu Man - Venkaiah Naidu: హను మాన్ మూవీ చిన్నా పెద్దా.. ఆడ మగ తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే సంక్రాంతి విడుదలైన సినిమాల్లో అత్యధిక షేర్.. గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా హను మాన్ రికార్డులకు ఎక్కింది. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు హనుమాన్ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను మాజీ ఉపరాష్ట్రతి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ముప్పవరపు వెంకయ్య నాయుడుగారు రామానాయుడు స్టూడియోస్‌లో సోమవారం ఈ సినిమాను స్నేహితులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పై ప్రశంసల ఝల్లు కురిపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ.. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సినిమాలో ప్రతి ఘట్టం ఆకట్టుకుందన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాఫిక్స్ అద్బుతంగా ఉన్నాయన్నారు. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతర నటీనటుల యాక్టింగ్ బాగున్నాయనన్నారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు ఈ సినిమా మేకింగ్‌లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేసారు.  



హనుమాన్ సినిమా 2024లో తొలి హిట్‌గా నిలిచింది. ఈ మూవీ గురించి ప్రశాంత్ వర్మ గత రెండేళ్లుగా ఎంతో శ్రమించాడు. విడుదల సమయంలో సరైన థియేటర్స్ కూడా దొరకలేదు. అయినా.. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన పొంగల్ చిత్రాల్లో హైయ్యెస్ట్‌ గ్రాసర్‌గా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోంది. అంతేకాదు జనవరి నెలలో విడుదలైన చిత్రాల్లో కూడా అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించి చిత్రంగా నిలిచింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల షేర్ (రూ. 270 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. త్వరలో ఈ మూవీ రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అమెరికా బాక్సాఫీస్ దగ్గర $ 5 మిలియన్ యూఎస్ కలెక్ట్ చేసి టాప్ 5లో నిలిచింది. అంతేకాదు మీడియం అండ్ స్మాల్ రేంజ్ చిత్రాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.


గత కొన్నేళ్గుగా ఓ సినిమా థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే గగనమై పోతున్న ఈ రోజుల్లో ఈ మూవీ థియేట్రికల్‌గా రూ. 100 కోట్ల లాభాలను ఆర్జించడం మాములు ఊచకోత కాదు. తాజాగా ఈ మూవీ రూ. 115 కోట్ల రేంజ్ లాభాలను ఆర్జించింది. తెలుగు సినిమాల్లో ఇదో రేర్ ఆఫ్ ది రేర్ అని చెప్పాలి.


Also Read: Bottole Thrash: 'బాటిల్‌' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం


Also read: CAA in India: సీఏఏపై మళ్లీ వివాదం, వారం రోజుల్లో అమలు చేస్తామని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి