Hanuman 7 Days Collections: బాక్సాఫీస్ దగ్గర హను మాన్ దూకుడు ఫస్ట్ డే నుంచి కొనసాగుతూనే ఉంది. ప్రీమియర్స్ ద్వారానే దాదాపు రూ.3 కోట్లకు పైగా షేర్.. రూ. 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు హనుమాన్.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త సంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతేకాదు 2024లో తెలుగులోనే కాదు.. మన దేశంలోనే తొలి హిట్‌గా నిలిచింది హనుమాన్ మూవీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంక్రాంతి గట్టిపోటీలో సూపర్ స్టార్ మహేష్‌ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల గుంటూరు కారం సినిమా ఉన్న ఆ సినిమాతో పోటీని తట్టుకొని నిలబడింది హనుమాన్. తొలి రోజు నుంచే సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ జోరు కొనసాగిస్తూనే ఉంది. అంతేకాదు విడుదలైన ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.55 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్‌లోనే రూ. 7.82 కోట్ల షేర్.. (రూ. 14.35 కోట్ల వరకు గ్రాస్) వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర మంచి రాంపేజ్ చూపిస్తోంది. అంతేకాదు అమెరికాలో $4 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఆర్ఆర్ఆర్, సలార్ రికార్డులకు దగ్గరలో నిలిచింది.


ఇదే ఊపు కొనసాగితే యూఎస్ (అమెరికా) బాక్సాఫీస్ దగ్గర మరిన్ని రికార్డులను స్మాష్ చేసే పనిలో పడింది. ఇక హిందీ వెర్షన్‌లో ఇప్పటి వరకు ఈ సినిమా రూ.22.92 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 76.69 కోట్ల షేర్.. (రూ. 143.80 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రూ. 29.65 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ రూ. 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 46.19 కోట్ల థియేట్రికల్‌గా లాభాలను తీసుకొచ్చింది.
 
మొత్తంగా విడుదలై వారం రోజుల్లోనే  రూ. 50 కోట్ల లాభాలను తీసుకొచ్చిన ఈ సినిమా ఓవరాల్‌గా ఏ మేరకు బయ్యర్స్ కు లాభాలను తీసుకొస్తుందో చూడాలి. మరోవైపు ఈ సినిమా డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్  హక్కుల రూపేణా మరో రూ. 40 కోట్ల అదనపు లాభాలను నిర్మాతకు తీసుకొచ్చింది.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


Also Read Car Mileage Boosting Tips: ఎలాంటి ఖర్చులు లేకుండా ఈ టిప్స్‌తో మీ కారు మైలేజీని పెంచుకోవచ్చు..


ఓవరాల్‌గా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతోన్న ఈ శుభవేళలో హను మాన్ సినిమా తెలుగు సహా ఇతర భాషల్లో మంచి వసూళ్లను రాబట్టడం శుభ పరిణామం. రాబోయే రోజుల్లో హనుమాన్ ఏ మేరకు లాభాలను తీసుకొస్తుందో చూడాలి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter