HanuMan for Ram Mandir: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా చేసిన సినిమా హనుమాన్. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా లాంటి సినిమాల మధ్యలో విడుదలైన ఆ మూడు సినిమాలని కూడా వెనక్కి నెట్టి మరి సూపర్ సక్సెస్ సాధించింది ఈ చిత్రం. విడుదల అయ్యి ఒక వారం కావస్తున్న ఇంకా కూడా ఈ సినిమాకి హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. కాగా ఈ సినిమా వారం రోజుల్లో దాదాపు 150 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని ఈ మధ్యనే ప్రకటించారు. అయితే హనుమాన్ మీద తెగే ప్రతీ టికెట్‌లో ఐదు రూపాయలు అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు విరాళంగా ఇస్తామని సినిమా విడుదలకు ముందు టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పుడు చెప్పినట్టుగానే ఇప్పుడు విరాళం ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవరి 22 అనగా రేపు అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానుంది. ఇందుకోసం దేశమంతటా ఎంతో ఎదురు చూస్తుండగా.. తాజాగా హనుమాన్ టీం సైతం తమ భక్తిని చాటిచెప్పారు. ఇప్పటి వరకు హనుమాన్‌కు తెగిన టికెట్ల సంఖ్య .. అలానే ఎంత విరాళం ఇచ్చారన్నది చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు 53,28,211 టికెట్‌లు తెగియాని, 2,66,41,055 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చామని తెలియజేశారు సినిమా యూనిట్. హనుమాన్ సినిమాకు గంటకు వేలకు వేల టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయన్న సంగతి బుక్ మై షోను చూస్తే తెలుస్తోంది. ఇంకా కూడా ఈ సినిమా జోరు తగ్గేలా కనిపివ్వడం లేదు.


అయితే ప్రస్తుతం తగిన టికెట్ల వరకు రామ మందిరానికి రెండున్నర కోట్ల విరాళం ఇస్తున్నట్టు తెలియజేశారు సినిమా యూనిట్. కాగా ఇక దాదాపు రెండు వారాల వరకు తెలుగులో పెద్ద సినిమా విడుదలలు లేకపోవడం వల్ల.. హనుమాన్ తప్పకుండా తెలుగులో 200 లేదా 300 కోట్ల వరకు వసూలు చేయొచ్చని తెలుస్తోంది. చిన్న సినిమాగా వచ్చి ఇంత పెద్ద విజయం సాధించిన దాని వెనుక నిజంగానే హనుమంతుడు.. రాముడి ఆశీస్సులు తోడయ్యాయని ఎంతోమంది అభిమానులు పోస్టులు పెడుతున్నారు.


 



ఇప్పటి వరకు తెగిన టికెట్ల సంఖ్య ఇలా ఉంటే.. మున్ముందు ఇంకెన్ని టికెట్లు తెగుతాయో.. ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అంటూ ఈ చిత్రాన్ని తెగ పొగిడేస్తున్నారు సినీ ప్రేక్షకులు.


Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్


Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter