Happy Birthday Allari Naresh: టాలీవుడ్‌లో వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, అనతికాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అల్లరి నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు నరేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విలక్షణ పాత్రలకు సైతం ప్రాణం పోస్తూ సాగిపోతున్న నరేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లరి నరేష్‌కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. హ్యాపీ బర్త్‌డే నరేష్, నీకు అంతా మంచే జరగాలి, మరో ఏడాది అద్భుతంగా గడిచిపోవాలని ఆకాంక్షిస్తూ మహేష్ బాబు (Mahesh Babu) ట్వీట్ చేశాడు. వీరిద్దరూ మహర్షి సినిమాలో కలిసి నటించారని తెలిసిందే. ప్రముఖ పీఆర్వో బీఏ రాజు టీమ్ అల్లరి నరేష్‌కు బర్త్‌డే విషెస్ తెలిపింది. తెలుగు ప్రేక్షకులతో నవ్వుల పువ్వులు పూయించిన ఎంటర్‌టైనర్ అల్లరి నరేష్‌కు హ్యాపీ బర్త్‌డే అని శుభాకాంక్షలు తెలిపింది. మరికొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు నరేష్‌కు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు.


Also Read: RRR Movie Updates: ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది, రిలీజ్ డేట్‌పై సైతం మూవీ యూనిట్ క్లారిటీ



అల్లరి నరేష్ నటిస్తున్న 58వ సినిమా సభకు నమస్కారం. మల్లంపాటి సతీష్ దర్శకత్వంలో సభకు నమస్కారం సినిమా తెరకెక్కుతోంది. మహేష్ కోనేరు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే Allari Naresh ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారని బీఏ రాజు టీమ్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది.


Also Read: MAA Elections 2021: మా ఎన్నికల్లో నరేష్ కొత్త ప్రతిపాదన వర్కవుట్ అయ్యేనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook