MAA Elections 2021: మా ఎన్నికల్లో నరేష్ కొత్త ప్రతిపాదన వర్కవుట్ అయ్యేనా

MAA Elections 2021: టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతుంటాయి. నలుగురు బరిలో ఉండటంతో ఈసారి పోటీ రసవత్తరంగా మారిన నేపధ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 26, 2021, 05:52 PM IST
MAA Elections 2021: మా ఎన్నికల్లో నరేష్ కొత్త ప్రతిపాదన వర్కవుట్ అయ్యేనా

MAA Elections 2021: టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతుంటాయి. నలుగురు బరిలో ఉండటంతో ఈసారి పోటీ రసవత్తరంగా మారిన నేపధ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు.

తెలుగు సినీ పరిశ్రమలో(Tollywood)భాగమైన మా ఎన్నికలు (MAA Elections) ప్రతిసారీ సాధారణ ఎన్నికల్ని తలపిస్తుంటాయి. 5 వందల లోపున్న ఓటింగ్ కోసం జరిగే ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తి రేపుతుంటాయి. ప్రతిసారీ ఇద్దరు కీలక వ్యక్తుల ప్యానెల్స్ పోటీ పడుతుండేవి. ఈసారి మాత్రం ఏకంగా నలుగురు బరిలో నిలవడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్(Prakash raj), జీవిత్ రాజశేఖర్, హేమలు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ప్రకటించగా..మిగిలిన ముగ్గురు ప్రకటించాల్సి ఉంది.ఇండస్ట్రీ దిగ్గజ నటులు చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణ తదితరుల మద్దతుపై విభిన్న రకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. 

ఈ తరుణంలో మా ప్రస్తుత అధ్యక్షుడైన నరేశ్ (Naresh)కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. మా అధ్యక్ష పదవి ఈసారి మహిళకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహిళ అయితే ఏకగ్రీవానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. మా లో కుల,మతాలకు చోటు లేదని..స్థానిక, స్థానికేతర అంశాలకు ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.అందరికీ అందుబాటులో ఉంటూ..పనిచేసే వ్యక్తి ఉండాలని కోరుతున్నానన్నారు. మహిళ ప్రతిపాదనతో తన మద్దతు జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) లేదా హేమలలో ఎవరో ఒకరికని పరోక్షంగా సూచనలందించారు.

Also read: Prakash Raj, MAA elections: మా అసోసియేషన్‌ ఎన్నికల్లో నాన్-లోకల్ రాజకీయాలపై ప్రకాశ్ రాజ్ ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News