భారత సినీ పరిశ్రమలో దిగ్గజం, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) 78వ జన్మదినం నేడు. ఈ సందర్భంగా జాతీయ, అంతార్జాతీయ స్థాయిలో అభిమానులు ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రముఖులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలుగు,తమిళ సినీ ప్రముఖులతో అమితాబ్ బచ్చన్ ఆత్మీయ అనుబంధం ఉంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ), రజినీకాంత్ వంటి తారలు కూడా ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ | Prabhas Updates: బిగ్ బీ పాత్ర పేరే ప్రభాస్ మూవీ టైటిల్…నాగ్ అశ్విన్ క్లారిటీ


అక్కినేని కుటుంబం మొత్తం నటించిన మనం చిత్రంలో అమితాబ్ బచ్చన్ కొన్ని సెకన్ల పాటు కనిపించినా మెరిసిపోయారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరాలో మరో కీలక పాత్రలో నటించారు. మరో వైపు ప్రభాస్ ( Prabhas ), నాగ్ అశ్విన్ చిత్రంలో కూడా ఆయన పుల్ లెన్త్ పాత్రలో కనిపించనున్నారు అని ఇటీవలే ప్రకటించారు. అంటే తెలుగు సినిమాతో ఆయనుకున్న అనుబంధం అలాంటిది. అందుకే ఆయన పుట్టిన రోజును తెలుగు సినీ ప్రముఖులు కూడా సెలబ్రేట్ చేస్తూ విషెస్ తెలిపారు. 
 




 



ALSO READ | NEET Results 2020: నీట్ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు విడుదల తేదీలు ఇవే!  ఇలా చెక్ చేయండి