Sirivennela Sitarama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
టాలీవుడ్ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
Sirivennela Sitarama Sastry: ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యం(Sirivennela Sitarama Sastry health) పై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్(Health Bulletin)ను విడుదల చేశారు. ''సిరివెన్నెల ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని. నిపుణులైన వైద్యులతో ఆయనకు వైద్యం అందిస్తున్నామని'' కిమ్స్ వైద్యులు(Kims Doctors) తెలిపారు. సిరివెన్నెల ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
సిరివెన్నెల న్యూమోనియా(Pneumonia)తో బాధపడుతూ నవంబరు 24న కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. సిరివెన్నెల సినిమా(Sirivennela Movie)లో సీతారామశాస్త్రి 'సిరివెన్నెల సీతారామశాస్త్రి'గా ఫేమస్ అయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ నటీనటులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కోరుకుంటున్నారు.
Also Read: Sirivennela Sitarama Sastry: ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థత
శాస్తి గారి స్వస్థలం ఏపీలోని అనకాపల్లి. తెలుగు సినీ గీత రచయితల్లో సీతారామశాస్త్రి గారిది ప్రత్యేక స్థానం. సిరివెన్నెల, రుద్రవీణ, స్వయం కృషి, స్వర్ణకమలం, గాయం, చక్రం తదితర చిత్రాల్లో ఆయన రాసిన పాటలు ఎప్పుడూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. రుద్రవీణ(Rudraveena)లోని 'లలిత ప్రియ కమలం విరిసినదీ' పాటకు ఆయన జాతీయ అవార్డు(National Award) అందుకున్నారు. అదే విధంగా గాయం చిత్రంలోని 'నిగ్గ దీసి అడుగు' అనే గీతాన్ని స్వయంగా తానే రాసి..నటించారు. ఈ పాటకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే నంది పురుస్కారం లభించింది. ఆయన ఉత్తమ గీత రచయితగా ఎన్నో అవార్డులను పొందారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook