Hello Baby - Nandita Swetha: అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన మూవీ 'హలో బేబి'. SKML మోషన్ పిక్చర్స్ రూపొందించిన చిత్రం 'హలో బేబి'. తాజాగా ఈ సినిమా  మోషన్ పోస్టర్‌ను  ప్రముఖ నటి నందితా శ్వేత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోలో క్యారెక్టర్ తో ఈ చిత్రం రూపొందించడానికి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ ఈ సినిమాలో చూపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి డిఫరెంట్ చిత్రాలను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారన్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది హలో బేబి. ఇలాంటి అవార్డులు, రివార్డ్స్ ఇంకా చాలా ఈ చిత్రానికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు హీరోయిన్ నందిత శ్వేత. 


ఈ చిత్ర నిర్మాత  కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ భారతదేశంలోనే మొదటి హ్యాకింగ్ విత్ సోలో క్యారెక్టర్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఈ మూవీ చేసేటప్పుడు కచ్చితంగా హిట్ అవుతుంది అన్న నమ్మకం కుదిరిందన్నారు. మా దర్శకుడు రామ్ గోపాల్ రత్నం చాలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పమ్మి మంచి మ్యూజిక్ అందించారు. సినిమా కెమెరామెన్ రమణ కె నాయుడు అద్భుతంగా చిత్రాన్ని తీశారు. ఎడిటర్ సాయిరాం తాటిపల్లి అద్భుతమైనటువంటి ఎడిటింగ్ అంటించారు. ముఖ్యంగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ సింగిల్ క్యారెక్టర్‌లో నటించినా కావ్యకీర్తి అద్భుతమైన నటనతో అతి త్వరలో ఈ సినిమాను ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉంది.


Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook