Hema: హేమా ఆ రకమైన డ్రగ్స్ తీసుకుంది.. మరిన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టిన పోలీసులు..!
Hema Drugs Case: నటి హేమ డ్రగ్స్ తీసుకోలేదని సంచలన కామెంట్లు చేయగా.. ఆమె డ్రగ్స్ తీసుకుందని ఆధారాలను సమర్పిస్తూ.. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ 1,086 పేజీల చార్జ్ షీటును కోర్టుకు సమర్పించారు. అంతేకాదు నటి హేమ డ్రగ్ తీసుకుందని నిరూపిస్తూ అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టును కూడా ఆయన జత చేశారు.
Hema Drugs Case Update: ముఖ నటి హేమా మే 20న బెంగళూరులో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన విషయం అందరికీ తెలిసిందే. వైద్య పరీక్షల్లో కూడా ఆమె డ్రగ్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. విచారణకు రావాలి అని పోలీసులు నోటీసులు పంపితే రాలేను అంటూ డుమ్మా కొట్టింది. ఎట్టకేలకు విచారణకు వచ్చిన ఆమెను అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, జూన్ 14 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు. ఆ తర్వాత ఆమె బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే.
బయటకొచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమా.. తాను డ్రగ్స్ తీసుకోలేదని, తనకు టెస్ట్ చేయకుండానే పాజిటివ్ వచ్చిందని కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ మీడియా ముందు చెప్పుకొని బాధపడింది.
అయితే తాజాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ 1,086 పేజీల చార్జ్ షీటును కోర్టుకు సమర్పించారు. అందులో నటి హేమా ఎండిఎం ఏ సేవించిందని అందులో తెలిపారు. అందుకు సంబంధించి ఆమె వైద్య పరీక్ష ఫలితాలను కూడా జతపరచడం జరిగింది. ముఖ్యంగా పార్టీకి హాజరైన మరొక నటికి కూడా టెస్ట్ చేయగా, ఆమెకు నెగిటివ్ వచ్చిందని ఆమె సాక్షుల్లో ఒకరిగా పరిగణిస్తున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.
రేవ్ పార్టీలో పట్టుబడిన తర్వాత హేమా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అసలు ఆ పార్టీకి తాను వెళ్లలేదని హైదరాబాదులో ఉంటున్నట్టు బిర్యానీ వండుతున్న వీడియోని కూడా విడుదల చేసింది. తాను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పడంతో, పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెడికల్ రిపోర్టు పాజిటివ్ అని రావడంతో పోలీసుల ఆమెను అరెస్టు చేశారు. ఆపై బెయిల్ మీద బయటకు వచ్చింది.
నిజానికి వాసు, అరుణ్ లకు హేమా మంచి ఫ్రెండ్. వారు పార్టీకి ఆహ్వానిస్తేనే ఆమె వెళ్లింది. మొత్తం 88 మందిని నిందితులుగా గుర్తించారు. సెక్షన్ 27 బి కింద ఈమె పైన కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.10వేల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. మరి కోర్టు నిర్ణయం మేరకు రెండు శిక్షలు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Infinix Zero 40: కేక పెట్టించే ఫీచర్లు, 108MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమేరాతో Infinix
Also Read: Malaika father Suicide: స్టార్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. 7వ ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.