Nayanthara controversy video clip: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా నిలిచింది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ అదే స్టేటస్ ను  అనుభవిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇకపోతే ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడి ఈ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోని ఈమె కష్టాన్ని గుర్తించిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈమెపై డాక్యుమెంటరీ తీస్తోంది. ఈ నేపథ్యంలోనే డాక్యుమెంటరీ కి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. 


అయితే ట్రైలర్లో ధనుష్ నిర్మించి , నయనతార హీరోయిన్గా నటించిన నానుం రౌడీ దాన్ మూవీలో మూడు సెకండ్ల నిడివి ఉన్న క్లిప్ 1 అందులో యాడ్ చేయడం జరిగింది. తన అనుమతి లేకుండా నయనతార తన సినిమాలోని భాగాన్ని తన డాక్యుమెంటరీలో పెట్టుకుందనే కోపంతో రూ.10 కోట్లు ఇవ్వాలి అని లీగల్ నోటీసులు పంపించారు ధనుష్. 


దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార.. మీరు మీ తండ్రి, సోదరుడి సహాయంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కానీ నేను నా రెక్కల కష్టంతో ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం నాకు సహాయపడుతుంటే మీరు మాత్రం మీ కక్ష సాధింపులు మొదలుపెట్టారు అంటూ పోస్ట్ పెట్టింది. అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం నయనతార ధనుష్ చుట్టూ రెండేళ్లు తిరిగినా ఆయన అంగీకరించలేదన్నట్లు నయనతార తెలిపింది.


ఇకపోతే నయనతార తీసుకున్న ఆ క్లిప్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అందులో అసలు విజయ్ సేతుపతి, నయనతార ఒక బార్ లో ఉన్న చిన్న క్లిప్పు అది కూడా మూడు సెకండ్లు మాత్రమే. 


 



ఇది చూసిన నెటిజన్స్ దీనికోసమా మీరు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తోంది అంటూ ధనుష్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ప్రస్తుతం ధనుష్ పై విపరీతంగా నెగెటివిటీ పెరిగిపోతుందని చెప్పవచ్చు.


Read more: APSRTC: బస్సు ప్రయాణికులు ఎగిరి గంతేసే వార్త.. ఇక నుంచి జర్నీలో 25 శాతం రాయితీ.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.