APSRTC: బస్సు ప్రయాణికులు ఎగిరి గంతేసే వార్త.. ఇక నుంచి జర్నీలో 25 శాతం రాయితీ.. పూర్తి వివరాలు ఇవే..

Apsrtc 25 percent offer: ఏపీ సర్కారు బస్సు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని తెలుస్తొంది. ఇప్పటికే చాలా మంది బస్సుల్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయని గగ్గొలు పెడుతున్నారు. అలాంటి వారికి మాత్రం ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకొవచ్చు.
 

1 /6

ప్రస్తుతం కొన్నిరోజులుగా వరుసగా పండగలు వస్తున్నాయి. దీంతో ఆయా బస్సులలో చార్జీలు ఎడా పెడా పెంచేశారని బస్సు ప్రయాణికులు రచ్చ చేస్తున్నారు. టికెట్ డబ్బులు చాలా వసూలు చేస్తున్నారని కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  

2 /6

కొన్ని మార్గాలలో స్పెషల్ బస్సులు అని పెట్టి మరీ దోచేశారని కూడా బాధితులు తమ గొడును వెళ్లబొసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బస్సులో ప్రయాణించే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పిందని తెలుస్తొంది.  

3 /6

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు మాత్రం భారీగా రాయితీ కల్పించనున్నట్లు తెలుస్తొంది. అన్ని రకల ఆర్టీసీ బస్సుల్లో ఈ రాయితీ వర్తించనుందని అధికారులు వెల్లడించారు. బస్సు ప్రయాణంలో 25 శాతం రాయితీ ఇవ్వనున్నారు.దీని కోసం ఆరు రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డును బస్సులో చూపించాల్సి ఉంటుంది.   

4 /6

ఇతర రాష్ట్రాలకు చెందిన వారికైన కూడా ఈ బస్సు ప్రయాణంలో 25 శాతం రాయితీ అప్లికేబుల్ అవుతుందని తెలుస్తొంది.  బస్సుల్లో రాయితీ కోసం ఆధార్‌ కార్డ్‌ , పాన్ కార్డు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు,  సీనియర్ సిటిజన్ కార్డు వంటి వాటిలో ఏదొ ఒక్కటి దగ్గర ఉంచుకుంటే సరిపొతుందని అధికారులు చెప్పినట్లు తెలుస్తొంది.  

5 /6

మరోవైపు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో సినియర్ సిటిజన్లకు బస్సు ప్రయాణంలో రాయితీ కల్పించడం పట్ల ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.   

6 /6

కార్తీక మాసం నేపథ్యంలో ఏపీలో అన్ని ప్రధాన ఆలయాలకు ప్రత్యేకమైన బస్సుల్ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా.. రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో స్పెషల్ బస్సుల్ని నడిపిస్తున్ననట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.