Jathara Movie Success Meet: సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహించిన మూవీ జాతర. ఇటీవల థియేటర్స్‌లోకి వచ్చిన ఈ మూవీ సక్సెస్ ఫుల్ టాక్‌ సంపాదించుకుంది. మూవీటెక్ ఎల్‌ఎల్‌సీ, రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. చిత్తూరు జిల్లాలోని జాతర బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో సతీష్ బాబు మాట్లాడుతూ.. జాతర మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్‌కు  శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నానని చెప్పారు. నవంబర్ 8వ తేదీన తమ సినిమాతోపాటు మరో 10 సినిమాలు విడుదలైనా విజయాన్ని అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. టెక్నీషియన్స్, యాక్టర్స్ సినిమా విజయానికి కారణమని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KCR Movie: కేసీఆర్‌ పాలన మాదిరి.. 'కేసీఆర్‌' సినిమా సూపర్‌ హిట్‌ కావాలి


నిర్మాత ద్వారంపూడి శివ శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరూ కొత్త వాళ్లతో సినిమా తీశామన్నారు. పెద్ద యాక్టర్స్ ఉన్న సినిమాలతో పోటీ పడి ఈ మూవీని రిలీజ్ చేశామని.. ఇంత చిన్న మూవీకి అంత గుర్తింపు రావడం అంత సులభం కాదన్నారు. జాతర మూవీ ఒక వారం సక్సెస్‌ఫుల్‌గా ఆడి.. రెండో వారంలోకి కూడా అడుగుపెట్టిందన్నారు. తాము చాలా గర్వంగా ఫీలవుతున్నామన్నారు. విష్ణు మాట్లాడుతూ.. తాను ఈ సినిమా కథ వినే సమయంలో పల్లెటూరు, గ్రామా దేవత కాన్సెప్ట్ అని చెప్పగానే తాను కనెక్ట్ అయిపోయానని అన్నారు. డైరెక్టర్‌గా, హీరోగా సతీష్ బాబు ఎలా చేస్తారో అనుకున్నానని.. కానీ ఆయన నటనే ప్లస్ అయిందన్నార. అందరూ బాగా పర్ఫామెన్స్ చేశారని చెప్పారు. 


డైలాగ్ రైటర్ మాట్లాడుతూ.. ఈ మూవీలో పని చేయడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తాను పదేళ్లు ఇండస్ట్రీలో ఉన్నానని.. తొలిసారి ఫుల్ పేమెంట్‌ ఈ మూవీ ద్వారానే తీసుకున్నానని చెప్పారు. ప్రొడ్యూసర్‌కు తాను ఎప్పుడు చాలా రుణపడి ఉంటానని అన్నారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఇంకా రావాలని.. ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. దీయా రాజ్ హీరోయిన్‌గా యాక్ట్ చేయగా.. ఆర్‌కే నాయుడు, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


టెక్నీకల్ టీమ్:


==> రైటింగ్, డైరెక్షన్‌ : సతీష్ బాబు రాటకొండ 
==> సమర్పణ : గల్లా మంజునాథ్
==> ప్రొడ్యూసర్స్ : రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి
==> బ్యానర్లు : రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ, మూవీటెక్ LLC
==> కెమెరామెన్ : కె.వి. ప్రసాద్
==> మ్యూజిక్ : శ్రీజిత్ ఎడవణ
==> PRO : సాయి సతీష్


 Also Read: Black Clothes: అయ్యప్ప స్వాములు ఎందుకు నల్ల దుస్తులు ధరిస్తారు? కారణాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.