Hero Movie Grand Pre Release Event Daggubati Rana says that movie title is very lucky one: ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు, హీరో మహేశ్‌బాబు (Maheshbabu) మేనల్లుడు అశోక్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. "హీరో" టైటిల్‌తో వస్తోన్న గల్లా అశోక్ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వం వహించారు. సంక్రాంతి (sankranthi) కానుకగా ఈ మూవీ జనవరి 15 న రిలీజ్‌ కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో "హీరో" మూవీ ప్రీ రిలీజ్ వేడుక (Pre Release Event) ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా (Special Guest‌) హాజరైన రానా దగ్గుబాటి (Daggubati Rana) మాట్లాడుతూ.. అశోక్‌కి చాలా అదృష్టం ఉందన్నారు. తన మూవీకి హీరో అనే టైటిల్‌.. దాంతో పాటు స్టార్‌లోగో లభించటం చాలా లక్ అన్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతికి విడుదల కావడం మామూలు విషయం కాదన్నారు. మూవీ యూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు.


సుధీర్‌బాబు (Sudheer Babu) మాట్లాడుతూ.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచీ ఎవరైనా నటుడిగా అడుగేస్తుంటే విమర్శలు ఎదురవుతాయన్నారు. అతన్ని కూడా మనం చూడాలా అని చాలా మంది అనుకుంటుంటారని సుధీర్ అభిప్రాయపడ్డారు. 


అయితే అశోక్‌ (Ashok) చాలా కష్టపడ్డాడని.. ఆ విషయం తనకు తెలుసు అని సుధీర్ అన్నారు. అతను కచ్చితంగా సక్సెస్ చూస్తాడని చెప్పుకొచ్చారు. ఒకవేళ తన పిల్లలు సినిమాల్లోకి వస్తే.. అశోక్‌నే ఫాలో అవ్వమని తాను వారికి చెప్తానని సుధీర్ అన్నారు. ఇక హీరో మూవీలోని (Hero Movie) కొన్ని పాటలు, ట్రైలర్‌‌ ఇప్పటికే రిలీజ్ అయి యూట్యూబ్‌లో దూసుకెళ్తున్నాయి.




 


Also Read : Bangarraju Movie: 'బంగార్రాజులో నాగ చైతన్యను చూసి ఆశ్చర్యపోతారు'


హీరో మూవీ (Movie) నుంచి తాజాగా బుర్రపాడవుతున్నదే పాట రిలీజైంది. అశోక్, నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) డ్యాన్స్‌తో ఈ పాట ఆకట్టుకుంటోంది. గిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి , మంగ్లీ ఈ పాట పాడారు.


Also Read : Mouni Roy Bikini Photos: బికినీ ఫొటోలతో సోషల్ మీడియాను డామినేట్ చేస్తున్న మౌనీరాయ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook