Prabhas Thanks CM Jagan: సీఎం జగన్‌కు ప్రభాస్ కృతజ్ఞతలు.. సినిమా టికెట్ల ధరల పెంపుపై హర్షం..
Prabhas on Movie Ticket Price Hike: ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయంపై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Prabhas on Movie Ticket Price Hike: ఏపీలోని సినిమా థియేటర్లలో టికెట్ల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సినీ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేస్తోంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిలకు కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమ ఆందోళనను అర్థం చేసుకుని సినిమా టికెట్ల ధరలను సవరించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాధేశ్యామ్ విడుదలకు ముందు టికెట్ల ధరలు పెంచితే సంతోషిస్తానని ప్రభాస్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కోరుకున్నట్లే రాధేశ్యామ్ విడుదల వేళ ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంది. దీంతో రాధేశ్యామ్‌కు కలిసొచ్చినట్లయింది. టికెట్ల ధరల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల రేట్లను సవరించినందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్న సినిమాలకు ఐదో షోకి అనుమతినివ్వడం నిర్మాతలకు మేలు చేస్తుందన్నారు.
కాగా, ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపుకు సినీ ఇండస్ట్రీ నుంచి చాలాకాలంగా వినతులు, డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖల వినతులను పరిగణలోకి తీసుకుని టికెట్ల ధరలు పెంచుతూ సోమవారం (మార్చి 7) జీవో జారీ చేసింది. థియేటర్లను నాలుగు కేటగిరీలుగా విభజించి.. మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు-గ్రామ పంచాయతీల పరిధిలోని థియేట్లకు వేర్వేరు టికెట్ ధరలు నిర్ణయించింది.
Also Read: Inter Hall Tickets: ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే
Also read: AP Assembly Budget Session 2022: అసెంబ్లీలో గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్, రేపు సభకు సెలవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook