AP Movie Ticket Price: సినీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్... సినిమా టికెట్ల ధరలు పెంచిన ఏపీ సర్కార్..

AP Movie Ticket Price: సినీ ఇండస్ట్రీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ల ధరలు పెంచుతూ జీవో జారీ చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 09:58 PM IST
  • ఏపీ థియేటర్లలో టికెట్ల ధరల పెంపు
  • ఈ మేరకు జీవో విడుదల చేసిన ప్రభుత్వం
  • థియేటర్లను నాలుగు కేటగిరీలుగా విభజించి ధరలు నిర్ణయించిన ప్రభుత్వం
AP Movie Ticket Price: సినీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్... సినిమా టికెట్ల ధరలు పెంచిన ఏపీ సర్కార్..

AP Movie Ticket Price: ఏపీ థియేటర్లలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థియేటర్లను నాలుగు కేటగిరీలుగా విభజించిన సర్కార్.. మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు-గ్రామ పంచాయతీ పరిధిలోని థియేటర్లకు వేర్వేరు ధరలను ఫిక్స్ చేసింది. కనీస టికెట్ ధరను రూ.20గా, గరిష్ట టికెట్ ధరను రూ.250గా నిర్ణయించింది. ఏసీ, నాన్ ఏసీ, మల్టీప్లెక్స్‌ అన్న తేడా లేకుండా ప్రతీ థియేటర్‌లో నాన్ ప్రీమియం కేటగిరి కింద 25 శాతం సీట్లు కేటాయించాలని జీవోలో పేర్కొంది. 

పెరిగిన టికెట్ల ధరల వివరాలు :

1) ప్రభుత్వ జీవో ప్రకారం.. మున్సిపల్ కార్పోరేషన్లలోని నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.40, ప్రీమియం టికెట్ ధర రూ.60గా ఉంటుంది. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.70, ప్రీమియం టికెట్ ధర రూ.100గా ఉంటుంది. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.100, ప్రీమియం టికెట్ ధర రూ.125 ఉంటుంది. మల్టీప్లెక్సుల్లో రెగ్యులర్ సీట్లకు రూ.150, రిక్లైన్ సీట్లకు రూ.250గా నిర్ణయించారు.

2) మున్సిపాలిటీల్లోని నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.30, ప్రీమియం టికెట్ ధర రూ.50గా ఉంటుంది. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.60, ప్రీమియం టికెట్ ధర రూ.80గా ఉంటుంది. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.80, ప్రీమియం టికెట్ ధర రూ.100 ఉంటుంది. మల్టీప్లెక్సుల్లో రెగ్యులర్ సీట్లకు రూ.125, రిక్లైన్ సీట్లకు రూ.250గా నిర్ణయించారు.

3) నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోని నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.20, ప్రీమియం టికెట్ ధర రూ.40గా ఉంటుంది. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.50, ప్రీమియం టికెట్ ధర రూ.70గా ఉంటుంది. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.70, ప్రీమియం టికెట్ ధర రూ.90 ఉంటుంది. మల్టీప్లెక్సుల్లో రెగ్యులర్ సీట్లకు రూ.100, రిక్లైన్ సీట్లకు రూ.250గా నిర్ణయించారు.

సినిమా టికెట్ల ధరల పెంపుపై నియమించిన కమిటీ సిఫారసులను, తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రతినిధులతో సంప్రదింపులను పరిగణలోకి తీసుకుని టికెట్ల ధరలు పెంపుపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

Also Read: Bheemla Nayak: చిత్తూరులో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు షాక్... జంతు బలి కేసు నమోదు చేసిన పోలీసులు..  

Also Read: ఢిల్లీలో ఒక న్యాయం.. రాష్ట్రంలో మరో న్యాయమా.. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హరీష్ రావు రియాక్షన్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News